సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ''యశోద". ఇదొక స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లింప్స్ మరియు టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ ఆవిష్కరించిన 'యశోద' ట్రైలర్ థ్రిల్లింగ్ గా ఉంది. తెలుగులో విజయ్ దేవరకొండ.. తమిళంలో సూర్య.. కన్నడలో రక్షిత్ శెట్టి.. మలయాళంలో దుల్కర్ సల్మాన్.. హిందీలో వరుణ్ ధావన్ వంటి హీరోల చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేయబడింది.
ట్రైలర్ లోకి వెళ్తే.. 'నీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్ళు వినిపించాయా? బిడ్డను కడుపున మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది' అని సమంత చెప్పడంలో ప్రారంభం అవుతుంది. ఇందులో సమంతను సరోగెంట్ మదర్ గా.. అంటే అద్దెకు బిడ్డని కనిచ్చే తల్లిగా చూపించారు.
ఇందులో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఒక డాక్టర్ పాత్రలో నటించగా.. సరోగసీ బిడ్డలను సంరక్షించే వ్యక్తిగా వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించింది. అమీర్ ఖాన్ - షారుక్ ఖాన్ - కరణ్ జోహార్ - శిల్పా శెట్టి - సన్నీ లియోన్.. వీళ్లంతా సరోగెంట్ పేరెంట్స్ అని ట్రైలర్ లో ప్రస్తావించారు.
అయితే సరోగసీ ముసుగులో అక్కడ ఏదో పెద్ద వ్యవహారం నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకునే క్రమంలో సామ్ ప్రమాదంలో పడింది. తనని తాను కాపాడుకోడానికి ఆమె శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇందులో రావు రమేష్ - మురళీ శర్మ - కల్పిక గణేష్ - సంపత్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
ట్రైలర్ లోనే 'యశోద' కాన్సెప్ట్ ఏంటనేది మేకర్స్ హింట్ ఇచ్చారు. సమంత ఎప్పటిలాగే అసాధారణమైన నటనతో.. అద్భుతమైన విన్యాసాలతో అదరగొట్టింది. సుకుమార్ విజువల్స్ మరియు మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఓవరాల్ గా ఇంటెన్స్ యాక్షన్ మరియ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన 'యశోద' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా సాగింది. ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్ కు హామీ ఇస్తోంది.
'యశోద' చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దర్శకద్వయం హరి & హరీష్ తెరకెక్కించారు. దీనికి అశోక్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.
'యశోద' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురానున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View