క్రిస్టియన్ మ్యారేజ్ కూడా అదుర్స్

Update: 2017-10-08 04:20 GMT
ఏడేళ్ల పరిచయం.. నాలుగేళ్ల ప్రేమ.. ఫైనల్ గా గత రెండు రోజుల్లో పెళ్లి బంధంతో మరింత దగ్గరైంది. అక్కినేని నాగ చైతన్య- సమంత.. మొదటి సినిమాకే  ఆమె మనసుకు నచ్చిన నాగ చైతన్య రెండవ సినిమాకే తన ప్రేమను చెప్పేశాడు. హిందు సంప్రదాయం ప్రకారం చైతు పెళ్లి చేసుకొని సమంతను ఏడడుగులు నడిపించగా.. సమంత క్రిస్టియన్ పద్దతిలో ఉంగరాన్ని తొడిగింది.

మొన్న జరిగిన హిందు పెళ్లి వేడుక ఏ స్థాయిలో జరిగిందో అంతే స్థాయిలో క్రిస్టియన్ మ్యారేజ్ కూడా జరిగింది. సమంత లాంగ్‌ ఫ్రాక్‌ లో ఏంజిల్ లా కనిపించగా.. చైతన్య సూట్‌ లో పర్ఫెక్ట్ జెంటిలిమెన్ లా మెరిసాడు. ఈ వేడుక సాయంత్రం 5 గంటలనుండి దాదాపు 7 గంటల వరకు జరిగింది. ఇక తర్వాత మంచి పార్టీ జరిగింది. ప్రతి ఒక్కరు ఆ పార్టీలో చాలా ఎంజాయ్ చేశారు.  ఇక సమంత కుటుంబం వారు ఈ పెళ్లి బంధంతో అక్కినేని కుటుంబానికి చాలా దగ్గరయ్యారనే చెప్పాలి.

అందరు చాలా చాలా క్లోజ్ అయిపోయారు. దీంతో సమంత చాలా సంతోషించింది. ఇక రేపటితో ఎవరింటికి వారు బయలుదేరుతారు. అక్కినేని - సమంత ఫ్యామిలీ కూడా హైదరాబాద్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మరో రిసిప్షెన్ పార్టీ ఉంది.  సినీ రాజకీయ ప్రముఖులందరిని పిలిచి నాగార్జున అదిరిపోయే పార్టీ ఇవ్వనున్నారు.
Tags:    

Similar News