టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ యంగ్ కంపుల్ అంటే కచ్చితంగా సమంత - నాగచైతన్యల పేర్లే వస్తాయి. తొలి సినిమా చేస్తున్న రోజుల్లోనే ప్రేమలో పడినా ఏడేళ్లపాటు దానిని చాలా సీక్రెట్ గా ఉంచి రెండువైపులా పెద్దవాళ్ల అంగీకారం తీసుకున్నాక తమ ప్రేమ వ్యవహారం బయటపెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉన్న ఈ జంట మరో నెలలో పెళ్లి పీటలెక్కనుంది.
అక్టోబరులో గోవాలో అయినవాళ్లు, స్నేహితులు కొద్దిమంది సమక్షంలో సమంత - నాగచైతన్యల పెళ్లి జరగనుంది. 6వ తేదీన హిందూ పద్ధతిలో.. 7వ తేదీన క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి వేడుక జరగనుంది. పెళ్లి సింపుల్ గా జరిగిన రిసెప్షన్ మాత్రం అదరగొట్టేయాలని నాగచైతన్య తండ్రి నాగార్జున ముందే డిసైడయ్యారు. అక్టోబరు 10న గ్రాండ్ రిసెప్షన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఫంక్షన్ కు సినీ ప్రముఖులు - రాజకీయ నాయకులు - బిజినెస్ పీపుల్ కు ఇన్విటేషన్ పంపనున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ నుంచి సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు రిసెప్షన్ కు హాజరు కానున్నారు. సమంత తెలుగుతో పాటు తమిళంలోనూ టాప్ హీరోయిన్ కావడం.. ఆమె సొంత ఊరు చెన్నై కావడంతో కోలీవుడ్ నుంచి చాలామందే ఫంక్షన్ కు అటెండ్ అవుతారని అంచనా వేస్తున్నారు.
పెళ్లి వేడుకకు సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ సమంత - నాగచైతన్య దగ్గరుండి చూసుకుంటున్నాడు. వాళ్ల పెళ్లి ఖర్చులకు చెక్ ఇవ్వడం తప్ప తాను చేస్తోందేం లేదంటూ నాగార్జున ఆల్రెడీ చెప్పేశాడు. రిసెప్షన్ బాధ్యత మాత్రం మొత్తం నాగార్జునే స్వయంగా డీల్ చేస్తున్నాడు. పెళ్లి వేడుక - హడావుడి అంతా ఆ రోజునే కనిపించనుంది.