ఐఐటీలో సమంత.. అసలు ట్విస్ట్ నిత్య

Update: 2016-07-08 04:47 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న జనతా గ్యారేజ్ మూవీలో హైలైట్స్ చాలానే ఉండనున్నాయి. భారీ కాస్టింగ్ తో పాటు పాత్రలన్నీ విభిన్నంగా ఉంటాయనే విషయం అర్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో.. కాన్సెప్ట్ ఎలా ఉండనుందో హింట్ ఇచ్చేశారు. ఇప్పుడు జనతా గ్యారేజ్ స్టోరీలో మరో కీలక అంశం తెలిసింది.

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ ఓ ఐఐటీ స్టూడెంట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. సరిగా ఈ కాలేజ్ లోనే యంగ్ టైగర్ కి బ్యూటీ సమంతతో పరిచయం అవుతుందట. వీళ్లిద్దరి మధ్య లవ్ అండ్ రొమాన్స్ ఎపిసోడ్ లు ఓ రేంజ్ లో ఉంటాయంటున్నారు. ఐఐటీ ముంబైలో ఎన్టీఆర్ కి ఉండే లవ్ స్టోరీ సమంతపై నడుస్తుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో స్టూడెంట్ రోల్ పోషించలేదు. అందుకే ఈ ఎపిసోడ్ ఆడియన్స్ కు కొత్తగాను థ్రిల్ ఇచ్చేదిగాను ఉంటుందని యూనిట్ జనాలు అంటున్నారు. అలాగే సమంత రోల్ కూడా యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందట.

ఇక నిత్యామీనన్ రోల్ ని ఇంట్రడ్యూస్ చేసే విధానం చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే అని టాక్. సినిమా మొత్తానికి ఈమె పాత్ర కీలకం కాగా.. కథను మలుపు తిప్పే రోల్ కూడా ఇదే అని టాక్. జనతా గ్యారేజ్ లో ఇద్దరు హీరోయిన్లను సెట్ చేసినా ఇద్దరినీ స్టోరీలో భాగంగా చేయడంతో పాటు.. కీలకమైన పాత్రలే ఉంటాయని తెలుస్తోంది.

Tags:    

Similar News