అక్కినేని కోడలు సమంత ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `ఓ బేబి`. కొరియన్ సినిమా `మిస్ గ్రానీ`(2014)కి రీమేక్ ఇది. నందిని రెడ్డి దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కథ ఆద్యంతం ఆసక్తికరం. 20 ఏళ్ల అమ్మాయిగా 70 ఏళ్ల భామగా సామ్ ద్విపాత్రాభినయం చేస్తుండడం సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. ఈ క్రేజీ చిత్రంలో నాగశౌర్య, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథానుసారం 70 ఏళ్ల భామకు 20 ఏళ్ల వయసు బ్యూటీగా మారాలన్న కోరిక పుడితే అటుపై ఏం జరిగింది? అన్నదే సినిమా కథాంశం. అచ్చం తన పోలిక ఉన్న 20 ఏళ్ల అమ్మాయి కనిపించాక 70 ఏళ్ల భామ మనసు ఎలా మారింది? అన్నది సంథింగ్ స్పెషల్.
ఇంతకీ ఈ సినిమాలో 20 వయసు బ్యూటీకి లవర్ ఎవరు? 70 ఏళ్ల భామకు భర్త ఎవరు? అంటే .. టాప్ సీక్రెట్ ని లీక్ చేశారు నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్. ఆయన ఈ సినిమాలో 70 వయసు భామ్మకు భర్త గా నటిస్తున్నారు. శౌర్య 20 ఏళ్ల సామ్ కి లవర్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా పూర్తవుతోందని సమాచారం. ఎఫ్ 2 అర్థశతదినోత్సవ వేడుకలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ (62) మాట్లాడుతూ -``సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలో నటిస్తున్నా.. నేను - సమంత జంటగా నటిస్తున్నాం.. రాత్రి 12 దాకా షూటింగ్ చేశాం. 10 పీఎంకి కేక్ తెచ్చి కట్ చేయించారు. ఎందుకు అంటే `ఎఫ్ 2` రిలీజైన రోజు అని చెప్పారు. నందిని రెడ్డి- సమంత ఆ పని చేశారు. ప్రజల్ని నవ్వించే సినిమా వచ్చినందుకు ఆ వేడుక చేసుకున్నాం`` అని తెలిపారు.
ఈ వేదికపై అనీల్ రావిపూడిని నవ్వుల కిరీటి రాజేంద్రుడు ఏకంగా జంధ్యాలతో పోల్చడం ఆసక్తికరం. జంధ్యాల నుంచి అనీల్ రావిపూడి వరకూ నవ్వును నమ్మిన వాడు నవ్వుల పాలు కాలేదు. ఎస్వీకే (వేదికపై ఎస్.వి.కృష్ణారెడ్డిని చూపిస్తూ) కూడా ఆ కోవలో దర్శకుడే.. అదే కామెడీని నమ్ముకున్న అనీల్ సక్సెసయ్యాడు. అతడు నన్ను డాడీ అని పిలుస్తాడు. మై సన్ నవ్వును నమ్ముకుని నవ్వును ఎంత గొప్పగా చూపించాడో ఎఫ్ 2 చూస్తే అర్థమవుతుంది. ఈ క్రెడిట్ నవ్వుకు చెందుతుందని నమ్ముతాను... అంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్రుడు.