'జాను'కు మరోదారి లేదా?

Update: 2020-01-22 10:57 GMT
తమిళం లో  సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న '96' చిత్రాన్ని తెలుగులో 'జాను'గా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. తమిళంలో విజయ్‌ సేతుపతి మరియు త్రిష జంటగా నటించగా తెలుగులో శర్వానంద్‌ మరియు సమంతలు జంటగా నటించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే టీజర్‌ విడుదల చేశారు. తాజాగా నిన్న ఒక పాటను కూడా విడుదల చేశారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మొదట సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావించారు. కాని అదే రోజున విజయ్‌ దేవరకొండ నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్‌ దేవరకొండ తో  పోటీ వద్దనుకున్న జాను మేకర్స్‌ వారం ముందుగానే సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. వారం ముందు కాకుండా ఆలస్యం గా వస్తే పరీక్షల సీజన్‌ ప్రారంభం అయ్యి కలెక్షన్స్‌ పై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

జానుకు ప్రస్తుతం ఫిబ్రవరి 7వ తారీకున రావడం తప్ప మరే దారి లేదని.. అందుకే వారం ముందే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరో వారం రోజుల్లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా పూర్తి చేసి ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ఫిబ్రవరి 1 లేదా 2వ తారీకుల్లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించబోతున్నారు. సినిమాను హంగామాగా కాకుండా సింపుల్‌ గానే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Tags:    

Similar News