అక్కినేనీస్ కి సమంత దగ్గరైపోయిందిగా

Update: 2016-09-12 05:03 GMT
అక్కినేని నాగచైతన్య.. టాలీవుడ్ బ్యూటీ సమంతల లవ్ స్టోరీ ఇప్పుడు అందరికీ రివీల్ అయిపోయింది. రీసెంట్ గా అక్కినేని నాగార్జున నుంచి వీరి లవ్ స్టోరీ-పెళ్లిపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది కానీ.. తను అఫీషియల్ గా అనౌన్స్ చేసేవరకు ఆగమన్నారంతే. అయితే.. సమంత ఇప్పటికే అక్కినేని కుటుంబంలో దాదాపు ఓ మెంబర్ అయిపోయింది. నాగ్ అండ్ ఫ్యామిలీతో కలిసి.. చక్కర్లు కూడా కొట్టేస్తోంది.

చైతుతో కలిసి కనిపించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ అక్కినేని అఖిల్ తోను.. అక్కినేని అమలతోనూ కూడా సమంత కనిపించింది. ఇందుకు సంబంధించిన పిక్చర్స్ ఇప్పటికే హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా అమల-సమంతల మధ్య మంచి బాండింగ్ కుదిరిందని చెప్పేస్తున్నారు. అమల కూడా సినిమా రంగంలో బాగా వెలిగిపోయిన స్టేజ్ నుంచి.. అక్కినేని కుటుంబానికి కోడలుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తే. ఇప్పుడు సమంత కేవలం హిస్టరీ రిపీట్ చేస్తోందంతే.

మరోవైపు ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ మంచి హుషారు మీదే ఉంది. ఇటు నాగచైతన్యతోపాటు.. నాగ్ మరో కుమారుడు అక్కినేని అఖిల్ కూడా పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. వీళ్లిద్దిరి పెళ్లి గురించి ఒకేసారి చెప్పేసి అనౌన్స్ చేసినా.. పెళ్లిళ్లు మాత్రం విడివిడిగానే ఉంటాయని తెలుస్తోంది.
Tags:    

Similar News