స్టార్ హీరోయిన్ స్టాటస్ కి అక్కినేని బ్రాండ్ తోడైందా? లేక స్టార్ హీరోయిన్ గా.. సామాజిక సేవా కర్తగా సమంతను బిగ్ కార్పొరెట్ డీల్స్ వరిస్తున్నాయా? ప్రతియేటా సమంత బ్రాండ్ పబ్లిసిటీ రేంజ్ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఇప్పటికే పలు ప్రఖ్యాత బ్రాండ్లు సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుని ప్రచారం చేస్తున్నాయి. కళానికేతన్- సౌతిండియా షాపింగ్ మాల్- బిగ్ సి- హెల్త్ & ఫిట్ నెస్ .. ఇలా అన్ని విభాగాల్లో సమంత కార్పొరెట్ డీల్స్ కుదుర్చుకోవడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. వస్త్ర వ్యాపారం.. బంగారు వజ్రాభరణాల కంపెనీలు.. చేనేత అన్నిటికీ సమంత బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ప్రఖ్యాత కుర్ కురే బ్రాండ్ తో బిగ్ డీల్ కు సంతకం చేశారని తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటన బుల్లితెరపైనా ఎయిర్ కానుంది. మరోవైపు ఫ్యాషన్ & స్టైల్ కి సంబంధించి బ్రాండ్ ప్రమోషన్స్ లో సామ్ క్రేజు ఏం రేంజులో ఉందో తెలియజేయాలంటే మరో తాజా డీల్ గురించి ప్రస్థావించాలి. ప్రఖ్యాత లూయిస్ వూట్టన్ బ్రాండ్ కి సామ్ ప్రచారం చేస్తున్నారు. అందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ లోనూ సామ్ పాల్గొన్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
లూయిస్ ఊటన్ నుంచి ఖరీదైన వస్త్రాలు, లూయీస్ హూప్ చెవి రింగులు, ఆభరణాలకు సామ్ ప్రచారం కలిసి రానుంది. తాజ్ కృష్ణ వంటి చోట్ల ఇందుకు సంబంధించిన సేల్ ఎగ్జిబిషన్ ని ఈనెల 14, 15 తేదీల్లో ఏర్పాటు చేస్తున్నారు. లేటెస్టుగా లూయీస్ బ్రాండ్ దుస్తుల్లో సామ్ ఇచ్చిన ఫోజు యువతరంలోకి దూసుకుపోతోంది. పూర్తి బ్లాక్ కలర్ టాప్ .. బాటమ్ లో రెడ్& బ్లాక్ కాంబినేషన్ ఫ్రాకు.. అందుకు తగ్గ కాంబినేషన్ డఫుల్ పర్స్ అల్ట్రా మోడ్రన్ లుక్ తో ఆకట్టుకున్నాయి. మొత్తానికి బ్రాండ్స్ కేరాఫ్ అక్కినేని కోడలు అన్న పాపులారిటీ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు వచ్చింది.