చైతూ నోట ఆ మాట ఇష్టపడని సమంత

Update: 2019-03-18 12:31 GMT
అక్కినేని నాగచైతన్య మరియు సమంత పెళ్లి తర్వాత మొదటి సారి కలిసి నటించిన చిత్రం 'మజిలీ'. ఈ చిత్రానికి 'నిన్నుకోరి' ఫేం శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. విభిన్న ప్రేమ కథ చిత్రం దర్శకుడిగా పేరు దక్కించుకున్న శివ నిర్వాన ఈ చిత్రాన్ని కూడా ఒక వైవిధ్యభరిత, మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్‌ 5వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు పాటలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక సినిమా విడుదల రెండు వారాలు ఉండగానే అక్కినేని జంట ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

తాజాగా చైతూ మరియు సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ అవ్వడంతో చాలా సరదాగా సాగింది. ఆ ఇంటర్వ్యూలో చైతూను ఉడికించేలా సమంత తన భర్త బోరింగ్‌ వ్యక్తి అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇక అదే ఇంటర్వ్యూలో సమంత ఉడుక్కునేలా తనకు అమ్మాయిలు మరియు కార్లు, బైక్స్‌ అంటే చాలా మోజు అంటూ నాగచైతన్య గడుసుగా సమాధానం చెప్పాడు. ఆ సమాధానంకు సమంత చిరు కోపంను ప్రదర్శించింది.

అమ్మాయిలు, కార్లు మరియు బైక్‌ లు తనకు ఇష్టం అంటూ చైతూ చెప్పిన వెంటనే సమంత స్పందిస్తూ... ఏయ్‌ అలా అంటే ముఖంపై పంచ్‌ ఇస్తాను అంటూ నవ్వుతూ కామెంట్‌ చేసింది. సమంత, నాగచైతన్యల జోడీ చాలా అన్యోన్యంగా ఉంటుందని ఇండస్ట్రీ మరియు అభిమానుల్లో టాక్‌. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు ఇచ్చిన సమాధానాలతో వారి అన్యోన్యం నిజమే అని మరోసారి నిరూపితం అయ్యింది.
Tags:    

Similar News