చెన్నై నగరానికి వచ్చిన వరదలు భారీ నష్టాన్నే మిగిల్చాయి. ప్రాణ నష్టం ఎక్కువగా ఉండడమే కాదు.. ఆస్తి నష్టం చాలా ఎక్కువగా ఉంది. అసలు ఎంతగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేసేందుకే 2 నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా. అందుకే తన వంతుగా 30 లక్షల విరాళం ఇస్తున్నట్లు సమంత ప్రకటించింది.
ఇలా చెన్నైకి భారీ విరాళం ప్రకటించేందు పెద్ద కారణమే ఉంది. నిజానికి సమంత మళయాళీ వారసురాలే కానీ.. పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే. అక్కడే గ్రాడ్యుయేషన్ వరకూ చదివిన ఈ సౌత్ బ్యూటీకి చెన్నైతో చాలానే అనుబంధం ఉంది. అక్కడే కామర్స్ చదివింది ఈమె. దీంతోపాటు ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోనూ లీడ్ హీరోయిన్ గా వెలుగుతోంది.
రీసెంట్ గా రిలీజ్ అయిన 10, ఎన్రాదుకుళ్ల కాకుండా.. ఐదు భారీ క్రేజీ ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయి. ధనుష్ హీరోగా వస్తున్న తంగ మగన్, సూర్య హీరోగా చేస్తున్న 24 తోపాటు.. అర్జున్, దివ్య కార్తీక్ ల మూవీ, తెరి, వడ చెన్నైల్లో సమంత నటిస్తోంది. సాధారణంగానే సర్వీస్ చేయడంలో సమంత ముందు ఉంటుంది. తన రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని ఛారిటీకి ఉపయోగిస్తూ ఉంటుంది. అలాంటి తను పెద్ద హీరోయిన్ కావడంతో, మిగిలిన వారిని ప్రోత్సాహం లభిస్తుందనే ఆలోచనతోనే సమంత ఇంతగా విరాళం ఇచ్చిందంటున్నారు.
అయితే.. చెన్నైకి సాయం చేసిన హీరోయిన్ల విషయానికొస్తే బస్టాప్ మూవీ హీరోయిన్ ఇచ్చిన 10 లక్షల విరాళం మొదటిది. తన స్థాయికి ఇది చాలా పెద్ద మొత్తం అనాల్సిందే.