చైతు సినిమాల కోసం మాత్రం తిరుమల వెళ్తా!

Update: 2019-07-04 14:16 GMT
సమంతా ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఇప్పటికే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు.. ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.  ప్రతి సినిమాలో తన పాత్రలో ఏదో కొత్తదనం ఉండేలా ప్రయత్నిస్తున్న సామ్ ఈ సినిమాలో కూడా డిఫరెంట్ గా ట్రై చేసిందని ప్రోమోస్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది

ఇదిలా ఉంటే 'ఓ బేబీ' సినిమా విజయం సాధించాలని సమంతా కొద్దిరోజుల క్రితం తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంది.  'మజిలీ' సినిమా విడుదలకు ముందు కూడా ఇలాగే శ్రీవారి దర్శనం చేసుకోవడంతో సమంతా కు తిరుమల సెంటిమెంట్ గా మారిందని కథనాలు వచ్చాయి.  ఈ కథనాలపై స్పందించిన సామ్ తన ప్రతి సినిమాకు తిరుమల వెళ్ళడం తనకు సెంటిమెంట్ కాదని..తన కోసం ఎప్పుడూ తిరుమల కు వెళ్లలేదని.. చైతూ సినిమాల కోసం తిరుమలకు వెళ్లి మొక్కేదాన్ని అని తెలిపింది.  అయితే  మొదటి సారి తన సినిమా కోసం తిరుమల వెళ్లినట్టు తెలిపింది.  అయితే ఇకపై ప్రతిసారి ఇలానే వెళ్తానని చెప్పలేనని.. కుదిరితే వెళ్తాను లేకపోతే లేదని చెప్పింది. అయితే చైతు సినిమాల కోసం మాత్రం తప్పకుండా తిరుమలకు వెళ్తానని చెప్పింది.

భవిష్యత్ ప్రణాళికల గురించి వెల్లడిస్తూ యాక్టింగ్ కెరీర్ ను కొనసాగిస్తూనే ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తానని చెప్పింది.  అయితే దర్శకత్వం జోలికి మాత్రం పోనని బల్లగుద్ది మరీ చెప్పేసింది. ఇక తను నిర్మించే సినిమాల గురించి చెప్తూ మహిళలకు ప్రాధాన్యత ఉండే సినిమాలను నిర్మిస్తానని.. మసాలా సినిమాలకు దూరంగా ఉంటానని క్లారిటీ ఇచ్చింది.


Tags:    

Similar News