టాలీవుడ్ లోనే కాకుండా ఏ సినీ పరిశ్రమలో అయినా కూడా హీరోలకు మద్య పోటీ ఉండటం చాలా కామన్, అలాగే హీరోయిన్స్ మద్య కూడా పోటీ ఉంటుంది. కొందరు హీరోయిన్స్ ఇతర హీరోయిన్స్ పట్ల స్నేహభావంతో కాకుండా అసూయతో ఉంటారు. ముఖ్యంగా పాత హీరోయిన్స్ కొత్తగా వస్తుండే వారిపై జలసీ భావన కలిగి ఉంటారు. కాని సమంత మాత్రం అలా కాదని మరో సారి నిరూపించింది. తాజాగా సోషల్ మీడియాలో సమంత అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ కు స్పందించి అందరి దృష్టిని ఆకర్షించింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ రెండు ఫొటోలను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఆ ఫొటోలకు సమంత ''లవ్'' అంటూ హార్ట్ సింబల్ పోస్ట్ చేసింది. సమంత స్వయంగా లవ్, హార్ట్ సింబల్ పోస్ట్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ షాక్ అయ్యింది. నేను నమ్మలేక పోతున్నాను అంటూ అనుపమ సమంత లవ్ కామెంట్ కు సమాధానం ఇచ్చింది.
వీరిద్దరు కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన 'అఆ' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఉండవచ్చు. ఆ స్నేహంతోనే సమంత ఇలా అనుపమ పరమేశ్వరన్ ఫొటోలకు కామెంట్ చేసి ఉంటుంది. మరో హీరోయిన్ ఫొటోలకు స్పందించడంతో సమంత మరింతగా అభిమానుల మనసును దోచుకుంది. అందుకే సమంత ఈజ్ గ్రేట్ అంటూ అభిమానులు అంటున్నారు.