మాలీవుడ్ లోనూ స‌మంత‌ జెండా పాతే ప్లాన్!

Update: 2022-08-08 12:30 GMT
స‌మంత మాలీవుడ్ లోనూ జెండా పాతేసే ప్లాన్ తో ముందుకు క‌దులుతోందా? బాలీవుడ్ త‌ర‌హా ప్ర‌ణాళిక తో మాలీవుడ్ ఎంట్రీ లోనూ షురూ చేస్తుందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. సామ్ దాదాపు టాలీవుడ్ సూప‌ర్ స్టార్స్  అంద‌రి స‌ర‌స‌న న‌టించేసింది. మెగాస్టార్ చిరంజీవి..న‌ట‌సింహ బాల‌కృష్ణ మిన‌హా స్టార్ హీరోలంద‌ర్నీ క‌వ‌ర్ చేసింది.

కొన్ని లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో సైతం న‌టించింది. ఇక టాలీవుడ్ లో సామ్ కొత్త‌గా చేయ‌డానికి ఏం లేదు. మార్కెట్ ప‌రంగా మ‌రింత మెరుగ్గా ఉండ‌టం..డిఫ‌రెంట్  జాన‌ర్స్  ట్రై చేయ‌డం త‌ప్ప‌. `శాకుంత‌లం`..`య‌శోద` లాంటి చిత్రాల‌తో ఆజాన‌ర్ ని కొంత వ‌ర‌కూ ట‌చ్ చేస్తుంద‌ని చెప్పొచ్చు. త్వ‌ర‌లో బాలీవుడ్ లోనూ లాంచ్ అవుతుంది.

ఇప్ప‌టికే అక్క‌డ  మూడు నాలుగు సినిమాలు క‌మిట్ అయింది. అన్నీ పెద్ద బ్యాన‌ర్లు..స్టార్ హీరోల ప్రాజెక్ట్  లు కావ‌డంతో బ్యూటీకి అక్క‌డ తిరుగుండ‌ద‌న్న టాక్ వినిన‌పిస్తుంది. అయితే హిందీ ప‌రిశ్ర‌మ‌లో అమ్మ‌డు అవ‌కాశాలు చాలా తెలివిగా ఒడిసిప‌ట్టుకుంది. త‌న‌కున్న ప‌రిచ‌యాలు స‌హా `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ తో వ‌చ్చిన గుర్తింపు తో త‌న‌ని తాను ప్రోజ‌క్ట్ చేసుకోగల్గింది.

ఆ ఐడెంటిటీనే  బాలీవుడ్ అవకాశాల‌కు పూల బాట వేసింది. ఇప్పుడిదే స్ర్టాట‌జీతో మాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే దుల్కార్ స‌ల్మాన్  స‌ర‌స‌న ఓ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇది పూర్తిగా మాలీవుడ్ నేటివిటీ ఉన్న చిత్రం. కేర‌ళ సంస్కృతి సంప్ర‌దాయాల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ని స‌మాచారం.

ఇది సామ్ మాలీవుడ్ కెరీర్ ని బిల్డ్ చేయ‌డానికి  ఉప‌యోగప‌డే చిత్రంగా చెప్పొచ్చు.  దుల్కార్ స‌ల్మాన్ మాలీవుడ్ లో పెద్ద హీరో.  యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. అలాంటి న‌టుడితో తొలి సినిమా చేసి స‌క్సెస్ అందుకుంటే?  మ‌రిన్ని ఛాన్సులు అందుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. స‌మంత క‌లివిడి మ‌న‌స్త‌త్వం క‌ల‌ది. ఎవ‌రితోనైనా ఇట్టే క‌లిసిపోతుంది.

వాళ్ల‌తో  స్నేహాలు  కొన‌సాగించ‌గ‌ల‌దు. బాలీవుడ్ లో ఎంట్రీకి ముందే అక్ష‌య్ కుమార్ తో క‌లిసి `కాపి విత్ క‌ర‌ణ్` షోకి హాజ‌రైంది. టాలీవుడ్ లో చైత‌న్య‌తో బ్రేక‌ప్ త‌ర్వాత  త‌న‌పై నెగివిటీ స్ర్పెడ్ అయిన అవ‌కాశాలు ప‌రంగా ఇబ్బంద‌లు ఎదుర్కోకుండా జాగ్రత్త ప‌డ‌గ‌ల్గింది. ఇలా సామ్ లో  తెలివైన ల‌క్ష‌ణాలు కొన్ని మాలీవుడ్ లోనూ  బిజీ భామ‌గా మార్చే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News