స‌మంత క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన‌ట్టేనా?

Update: 2022-10-16 10:30 GMT
క్రేజీ హీరోయిన్ స‌మంత అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌రువాత `పుష్ప‌`తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసింది. తొలి సారి ఐట‌మ్ సాంగ్ లో న‌టించి వార్త‌ల్లో నిలిచింది. `ఊ అంటావా మావ‌.. ఊ హూ అంటావా..` అంటూ పాన్  ఇండియా వైడ్ గా ఊహించ‌ని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌తో క‌లిసి త‌మిళ చిత్రం `కాతువాకులు రెండు కాద‌ల్‌` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

న‌య‌న‌తార బాయ్ ఫ్రెండ్‌, భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ సినిమాల‌ని లైన్ లో పెట్టేసింది. స్టార్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ భార‌తంలోని ఆదిప‌ర్వం నేప‌థ్యంలో `శాకుంత‌లం` మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. 3డీ ఫార్మాట్ లోనూ విడుద‌ల కానున్న ఈ మూవీని త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో రూపొందుతున్న `య‌శోద‌`తో పాటు `ఖుషీ`లోనూ న‌టిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తో క‌లిసి సామ్ న‌టిస్తున్న `ఖుషీ` షూటింగ్ ద‌శ‌లో వుంది. త్వ‌ర‌లోనే త‌దుప‌రి షెడ్యూల్ ని ప్రారంభించ‌బోతున్నారు. ఇదిలా వుంటే సామ్ న‌టిస్తున్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ `య‌శోద‌` షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.

గ‌త కొన్ని నెల‌లుగా రిలీజ్ డేట్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. సోమ‌వారం అంటే అక్టోబ‌ర్ 17న ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టిస్తున్నామంటూ మేక‌ర్స్ ఇన్ డైరెక్ట్ గా ఆదివారం హింట్ ఇస్తూ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీని తెర‌కెక్కించారు.

రీసెంట్ గా విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీతో సామ్ ఈ సారి మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని టీజ‌ర్ చూసిన వారంతా కామెంట్ లు చేశారు. ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా, ఉన్ని ముకుంద‌న్ హీరోగా, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
Tags:    

Similar News