టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతున్న సమంత ఇటీవలే హిందీ ప్రేక్షకుల ముందుకు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ తో వెళ్లింది. మొదటి ప్రాజెక్ట్ తోనే హిందీలో మంచి పేరును దక్కించుకుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పుణ్యమా అని ఈ అమ్మడికి వరుసగా అక్కడ ఆఫర్లు వస్తున్నాయట. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న ప్రాజెక్ట్ లు సౌత్ లో చాలానే ఉన్నాయి. ఇదే సమయంలో ఈమె హిందీలో కూడా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత మరింత బిజీ అయిన ముద్దుగుమ్మ సమంత త్వరలోనే బాలీవుడ్ తెరపై సందడి చేస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉండగా తాజాగా ఆ విషయమై స్పష్టతను ఇచ్చింది.
బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా అంటూ ప్రశ్నించగా మంచి ప్రాజెక్ట్ లు.. తన పాత్ర విషయంలో కొత్తదనం ఉంటే ఏ భాషలో అయినా చేసేందుకు సిద్దంగా ఉంటాను అంటూ చెప్పేసింది. బాలీవుడ్ లో సినిమాలు చేయాలా వద్దా అనే విషయంలో ఎలాంటి నిర్ణయం లేదు. అక్కడ నుండి మంచి పాత్ర వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ బాలీవుడ్ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చింది. వెబ్ సిరీస్ లో దక్కిన పాత్రలాగే సినిమాల్లో కూడా వస్తే తప్పకుండా హిందీలో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సమంత చెబుతోంది. వరుసగా సినిమాలు చేస్తున్న సమంత బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు లో శాకుంతలం సినిమాను చేసిన సమంత త్వరలోనే తమిళంలో నయనతార తో కలిసి చేస్తున్న ఒక మల్టీ స్టారర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. పెళ్లి తర్వాత సమంత సినిమాల ఎంపిక.. పాత్రల ఎంపిక విషయంలో చాలా మార్పు వచ్చింది. తక్కువ సినిమాలు కమిట్ అవుతూ మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇద్దరు ఈమె హీరోయిన్ గా చేస్తున్న సినిమాలు ముందు ముందు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతాయనే నమ్మకంను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.