'మహా సముద్రం' లో ఫస్ట్ ఛాయిస్ సమంత..!

Update: 2021-10-14 07:35 GMT
'Rx 100' వంటి వైలెంట్ లవ్ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న అజయ్.. కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ''మహా సముద్రం'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్ - సిద్దార్థ్ హీరోలుగా.. అదితిరావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. దసరా కానుకగా ఈరోజు గురువారం థియేట్రికల్ ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది.

'మహా సముద్రం' ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఓపెన్ డ్రామా అని.. ఇందులో భావోద్వేగాలకు కొదువ ఉండదని అజయ్ భూపతి చెబుతూ వస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100' విడుదలైన రెండు నెలలకు రాసుకున్న ఈ కథకు క్యాస్టింగ్ సెట్ అవకపోవడంతో సెట్స్ మీదకు తీసుకెళ్లడం ఆలస్యమైంది. ఇది ఇద్దరు హీరోలతో చేయాల్సిన మల్టీస్టారర్ కావడంతో స్టోరీ నచ్చినప్పటికీ కొందరు వెనకడుగు వేశారని దర్శకుడు తెలిపారు.

సిద్దార్థ్ ముందుగానే ఈ ప్రాజెక్ట్ కోసం లాక్ చేసి పెట్టుకోగా.. చివరకు శర్వానంద్ ఓకే అనడంతో 'మహా సముద్రం' సినిమా పట్టాలెక్కింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర కలవడంతో ఇది భారీ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది. అయితే ఇందులో హీరోయిన్ గా అదితి రావు కంటే ముందుగా సమంత ను అనుకున్నట్లుగా అజయ్ భూపతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'మహా' పాత్రకు ముందు సమంత ను అనుకున్నానని.. ఈ కథ ఆమెకు చాలా బాగా నచ్చిందని.. వెంటనే చేయడానికి ఒప్పుకుందని దర్శకుడు తెలిపారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సమయానికి సామ్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం.. డేట్స్ క్లాష్ అవడం వల్ల ఆమె ఇందులో నటించలేదు అని చెప్పారు. ఈ నేపథ్యంలో సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్న అదితిరావు హైదరి ని తీసుకున్నామని.. సినిమా చూసిన తర్వాత ఈ రోల్ కు అదితి పర్ఫెక్ట్ అనిపించిందని అజయ్ భూపతి అన్నారు.

సమంత డేట్స్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల 'మహా సముద్రం' చేయలేదని అజయ్ చెబుతున్నప్పటికీ.. అప్పటికే ఈ సినిమాలో హీరోగా బొమ్మరిల్లు సిద్దార్థ్ ఫిక్స్ అయి ఉండటం వల్ల రిజెక్ట్ చేసి ఉండొచ్చనే ప్రచారం ఉంది. 'జబర్దస్త్' సినిమా సమయంలో సామ్ - సిద్ధు ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే టాక్ ఉండేది. వీరి ప్రవర్తన కూడా దీనికి తగ్గట్టుగానే ఉండేది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాతే సామ్.. నాగ చైతన్య ను వివాహం చేసుకున్నట్లు చెప్పుకుంటారు. సిద్ధు హీరో అవడం వల్లనే అంత మంచి పాత్రను సమంత వదులుకుందని టాక్. మరి సామ్ వదులుకున్న మహా పాత్ర హైదరి కి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో ఈరోజు తెలిసుపోతుంది.

ఇకపోతే నాగచైతన్య - సమంత జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అదే సమయంలో పరోక్షంగా సామ్ ను ఉద్దేశించినట్లుగా సిద్దార్థ్ చేసిన చీటర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే 'మహా సముద్రం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన సిద్ధు.. ఆ ట్వీట్ ఎవరినో ఉద్దేశించి చేసింది కాదని చెప్పుకొచ్చారు.

కాగా, ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత సిద్దార్థ్ మళ్ళీ తెలుగు తెర మీదకు మహా సినిమాతో వచ్చాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రల్లో మెప్పించిన టాలెంటెడ్ యాక్టర్.. ఇందులో ఇంటెన్స్ పాత్రలో నటించారు. ఈ సినిమా తనకు కచ్చితంగా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవుతుందని.. ఇకపై టాలీవుడ్ కు దూరం అయ్యే పరిస్థితి రాదని సిద్ధు అంటున్నాడు. మరి ఈ సినిమా వర్సటైల్ హీరోకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News