టాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ గా పాపులరైంది సమంత రూత్ ప్రభు. బాలీవుడ్ లో అనుష్క శర్మ.. దీపిక పదుకొనే లాంటి అగ్ర నాయికలకు ధీటుగా సౌత్ లో ఈ బ్యూటీకి పేరుంది. ఒక ఫ్యాషనిస్టాగా ఆ ఇద్దరినీ సామ్ అనుకరిస్తుందన్న టాక్ కూడా ఉంది. తాజాగా సమంత గత రాత్రి జరిగిన ఒక ఈవెంట్ లో చారల చీరలో దేశీ లుక్ తో తళుక్కున మెరిసింది. దక్షిణాది నుంచి ఏకైక సంపూర్ణ ఫ్యాషనిష్టా అని మరోసారి నిరూపించిందంటూ అభిమానులు ఈ లుక్ ని పొగిడేస్తున్నారు.
భారతీయ యోగా గురూ .. ఆధ్యాత్మక వేత్త సద్గురు జగ్గి వాసుదేవ్ తో పర్యావరణంపై ఒక ఈవెంట్ ని షూట్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ లోని సెట్స్ లో సామ్ ఈ కొత్త లుక్ తో కనిపించింది. `సేవ్ సాయిల్` పేరుతో యూనిక్ ఈవెంట్ ఇది. క్లాసిక్ బ్లాక్ అండ్ ఎల్లో చారల చీరలో సమంత నవ్వులు చిందిస్తూ ఈ వేదికపై అద్భుతంగా కనిపించింది.
మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ఎటువంటి ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ వర్క్ లేని టాప్ తో అద్భుతంగా కనిపించింది. మేకప్ లెస్ లుక్ తో దేశీ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ తో హెడ్ టర్నర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సమంత గత చిత్రం `కాతు వాకులా రెండు కాదల్` సంతృప్తికర ఫలితాన్ని అందించింది. చివరిగా నయనతార- విజయ్ సేతుపతి- సమంత ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.
బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మరోవైపు సామ్ నటిస్తున్న `యశోద` చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. అలాగే తన `శాకుంతలం` విడుదల కోసం ఎదురుచూస్తోంది.
విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న `ఖుషీ` షెడ్యూళ్లు కొనసాగుతున్నాయి. రెండవ షెడ్యూల్ జూన్ 8 నుండి కొనసాగుతోంది. అలాగే అవెంజర్స్ మేకర్స్ రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న `సిటాడెల్`లోనూ సామ్ నటిస్తోంది. వరుణ్ ధావన్- సమంత ప్రధాన పాత్రల్లో రాజ్ నిడిమోరు -కృష్ణ డికె దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కనుంది. జూలై నుంచి ఈ సిరీస్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఫ్యామిలీమ్యాన్ 2 తర్వాత సామ్ కి రాజ్ అండ్ డీకేతో అద్భుత అవకాశమిది. బాఫ్టా-విజేత దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్న చిత్రం `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్`తో సమంత హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.