జెస్సీగా సినీపరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు సమంత ఇంత సీను ఉంటుందని ఊహించి ఉండదు. గోల్డెన్‌లెగ్ అన్న పేరొస్తుందని, ఇంత పెద్ద స్టార్‌డమ్ తనని వరిస్తుందని అస్సలు ఊహించి ఉండదు. కానీ అనూహ్యం. ఓడలు బళ్లవుతాయి. బళ్లు ఓడలవుతాయి అంటారు. ఆ కోవలోనే పెద్ద స్టార్ రేంజుకి ఎదిగింది.
అయితే ఈ భామ పరిశ్రమలో అడుగుపెట్టాకే అన్నీ నేర్చుకుంది. తొలిసినిమా ఏమాయ చేశావేతో ఏదోలా మ్యానేజ్ చేసేసింది. ఆ తర్వాత నెమ్మదిగా నటనలో మెళకువలు నేర్చుకుంది. పెద్ద దర్శకులు, హీరోలతో పనిచేయడం వల్ల చాలా విషయాలు తెలిసొచ్చాయి. అయితే ఈ అమ్మడు ఇప్పటికీ డ్యాన్సుల్లో వీకే. మనకి ఉన్న స్టార్లతో ధీటుగా డ్యాన్సులు చేయాలంటే చాలా భయపడుతుందిట. ఇదే విషయాన్ని తనే స్వయంగా చెప్పుకుంది.
నేనేమీ పెద్ద డ్యాన్సర్‌ని కాను. ఇప్పటికీ డ్యాన్సులు అందరిముందూ చేయాలంటే భయమే. నా హీరోల వల్లే అవన్నీ బాగా నేర్చుకోగలిగాను.. అని నిజాయితీగా ఒప్పుకుంది. నిజమే టాలీవుడ్‌లో ఉన్న ఏ స్టార్ హీరోయిన్ అప్పటికప్పుడు అన్నీ నేర్చుకుని రాలేదు. ఇక్కడికొచ్చాకే అన్నీ నేర్చుకుని ఎదిగారంతే.