నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఓ బేబీ'. ఈ సినిమా జూలై 5 వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డీ సురేష్ బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ ప్రొడ్యూసర్ స్వర్గీయ డీ. రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సమంతా 'ఓ బేబీ' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
సమంతాకు చాలా రోజుల నుండి ఒక పూర్తి స్థాయి కామెడీ చిత్రంలో నటించాలని ఉందట. రిటైర్ అయ్యేలోపు ఆ కోరిక తీరుతుందా లేదా అని ఆలోచన పడిన సమయంలో సరిగ్గా 'ఓ బేబీ' ప్రాజెక్ట్ తన వద్దకు వచ్చిందని తెలిపింది. దీంతో తన కోరిక తీరిపోయిందని చెప్పింది. కామెడీ అంటే సినిమా మొత్తం కామెడీ మాత్రమే కాదని.. చివర్లో మనసుని హత్తుకునే క్లైమాక్స్ కూడా ఉంటుందని చెప్పింది. ఈ సినిమా మాతృక అయిన 'మిస్ గ్రానీ' ని చూసిన తర్వాత సమంతా తన అమ్మగారిని గట్టిగా కౌగలించుకోవాలని అనిపించిందట. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తమ పేరెంట్స్ ను హగ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పింది.
ఇక తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ కొంతకాలం క్రితం తను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. చేస్తే మంచి సినిమా చేయాలి.. లేకపోతే ఇంట్లో కూర్చోవాలి అని గట్టిగా అనుకుందట. అప్పటి నుంచి తన సినిమాల ఎంపికలో చాలా మార్పు వచ్చిందని.. 'రంగస్థలం'.. 'మహానటి'.. 'సూపర్ డీలక్స్'.. 'మజిలీ' లాంటి సినిమాలు చేయగలిగానని తెలిపింది. 'ఓ బేబీ' కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది.
ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్ఠాత్మక బ్యానర్ లో చేయడం తనకు గర్వంగా ఉందని చెప్పింది. సురేష్ బాబు గారివల్ల ఎంతో నేర్చుకున్నానని.. గతంలో సినిమా షూట్ అయిపోతే తన బాధ్యత అయిపోయిందని అనుకునేదట. కానీ ఇప్పుడు తన షూటింగ్ పార్ట్ పూర్తయిన తర్వాత కూడా ఎడిటింగ్ ఎలా జరుగుతోంది.. అవుట్ పుట్ అలా ఉంది.. సాంగ్స్ సినిమా కథకు సెట్ అవుతున్నాయా.. లాంటి అంశాలను గమనిస్తున్నానని తెలిపింది. ఈ సినిమా తనకు ఒక క్విక్ లెసన్ లాంటిదని చెప్పింది.