సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన 'ఓ బేబి' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సైలెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రంను చాలా జోష్ తో ప్రమోట్ చేస్తున్నారు. సినిమాపై జనాల్లో ఆసక్తిని కలిగించేలా ఇప్పటికే పోస్టర్ మరియు టీజర్ లను విడుదల చేయడం జరిగింది. ఒక బామ్మ కొన్ని కారణాల వల్ల పడుచు అమ్మాయిలా మారిపోతుంది. అప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తుందనేది ఈ చిత్రం ప్రధాన స్టోరీ లైన్. ఈ చిత్రంను సమంత చాలా ఆసక్తిగా చేసినట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది.
తాజాగా మీడియాతో సమంత మాట్లాడుతూ.. ఈ చిత్రం చేయడంతో నా రెండు కోర్కెలు తీరాయని చెప్పుకొచ్చింది. ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమా చేయాలని, సురేష్ బాబు గారితో కలిసి వర్క్ చేయాలనేది నాకు చాలా కాలంగా ఉన్న కోరిక. ఆ కోరిక ఈ చిత్రంతో తీరింది. ఇక పూర్తి స్థాయి కామెడీ పాత్రను నేను సినిమాల నుండి తప్పుకునేలోపు చేస్తానా లేదా అనుకున్నాను. అసలు అలాంటి పాత్ర నాకు వస్తుందా అని భావించాను. అయితే ఈ సినిమాతో ఆ కోరిక కూడా తీరింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాలోని నా పాత్ర ఉంటుంది.
ఇక సురేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా బాగుంది. ఆయన నన్ను ఒక బేబీలా చూసుకున్నారు. ప్రతి రోజూ స్కూల్ కు తీసుకు వెళ్లినట్లుగా సెట్ కు తీసుకు వెళ్లేవారు. షూటింగ్ ముగించుకున్న తర్వాత ఎడిటింగ్ చూశావా ఎలా వస్తుందో అనేవారు. దాంతో నేను 10 సార్లు ఎడిటింగ్ రూంకు వెళ్లి ఉంటాను. ఈ సినిమా సమయంలో చాలా నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ కు సంబంధించిన విషయాలతో పాటు క్రమ శిక్షణ సమయ పాలన ఇలా అన్ని విషయాల్లో కూడా స్కూల్ లో ఎలా అయితే నేర్చుకుంటామో అలా నేర్చుకున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓ బేబీ చిత్రంపై సమంత చాలా ఆశలు పెట్టుకుంది.