అవార్డు సినిమాలతో డబ్బుల్కెడొస్తయ్‌?

Update: 2015-06-09 06:36 GMT
క్యూట్‌ సమంత బైటికి కనిపించేంతటి అమాయకురాలేం కాదు. చూపుల్లో అమాయకత్వం, మాటల్లో నిజాయితీ కలబోసి మాట్లాడుతుంటే.. అరే .. ఇంత మంచి అమ్మాయా? అనుకునేరు. సందర్భాన్ని బట్టి కరుకైన కత్తిలాగా మారిపోవడం ఈ అమ్మడికే సాధ్యం. సందర్భోచితంగా మాట్లాడి అవతలివారిని బుట్టలో వేయడం తనకి మాత్రమే తెలిసిన విద్య.

ఇటీవల అవార్డు సినిమాల గురించి మనసులోని మాట చెబుతూ.. విస్మయం కలిగించే ఓ మాట అంది. అది మాట కాదు తూటా. గుండెల్లో గుచ్చుకుని విలవిలలాడేలా చేస్తుంది. అవార్డు సినిమాల్లో నటించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ డబ్బులెక్కడ వస్తాయ్‌? అంటూ ప్రశ్నించిన వారిని నిలదీసింది. డబ్బులు రానప్పుడు నిర్మాతలు ఎక్కడ ఉంటారు? నిర్మాత లేనిదే సినిమాలెవరు తీస్తారు? సినిమాలు తీయనిది మాకు అవకాశాలెవరిస్తారు? అవకాశాల్లేనిదే కోట్లకు కోట్లు ఎలా మూటగట్టుకుంటాం? అంటూ సూటిగా నిలదీసింది. లాజిక్‌ లేనిదే ఈ అమ్మడు మాట్లాడదు.. అనడానికి ఇంతకంటే ఏ ఎగ్జాంపుల్‌ చెప్పాలి.

కొత్త కథలు, కొత్త స్క్రిప్టుల్లో నటించాలని ఉన్నా కమర్షియల్‌గా వర్కవుటవ్వకపోతే ఏం లాభం? డబ్బులొచ్చే సినిమాలో నటిస్తే .. అన్నిటినీ మర్చిపోతాం... అంటూ లోన ఏ విషయాన్ని దాచుకోకుండా ఓపెన్‌గానే చెప్పేసింది. అందుకే సమంతను కనిపించేంత అమాయకురాలు కాదు.. అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు పరిశ్రమకి హ్యాండిచ్చి మాతృపరిశ్రమ తమిళ్‌లో నంబర్‌ -1 స్థానంపై కన్నేసింది. ఆ పనిలోనే బిజీగా ఉందిప్పుడు. అదీ సంగతి.



Tags:    

Similar News