పిల్లితోనే ఆట‌లా సామ్‌?

Update: 2018-10-05 12:38 GMT
మూగ జీవాల‌కు హాని క‌లిగితే అక్కినేని అమ‌ల స్పంద‌న ఎలా ఉంటుందో తెలిసిందే. బ్లూక్రాస్ అధ్య‌క్షురాలిగా వెంట‌నే రెస్పాన్స్ ఉంటుంది. త‌మ బాధ‌ను వ్య‌క్తం చేయ‌లేని మూగ జీవాల ప‌ట్ల క్రూరంగా వ్య‌వ‌హ‌రిస్తే వారికి శిక్ష ప‌డాల్సిందేన‌న్న‌ది బ్లూక్రాస్ సిద్ధాంతం. ఈ విష‌యంలో సెల‌బ్రిటీలంతా అవేర్‌ నెస్ క‌లిగి ఉన్నారు. అయితే సామాన్యుల‌కు మాత్రం తెలిసింది త‌క్కువే. ఇక ఈ త‌ర‌హా రూల్ ఉండ‌డం వ‌ల్ల తెలుగు సినిమాల్లో జంతుజాలం క‌నిపించ‌డం అన్న‌ది అరుదు అయిపోయింది. ఏనుగులు - పిల్లులే ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా సినిమాలు తీయ‌డం అన్న‌దే లేదు.

అదంతా అటుంచితే.. ఇదిగో ఇక్క‌డ అక్కినేని కోడ‌లు స‌మంత పిల్లుల‌తో ఎలా చెలిమి చేసిందో చూశారా?  వాటిని పిలిచి గోముగా ఇలా ముద్ద క‌లిపి పెడుతోంది. పిల్లుల ఆక‌లి తీరుస్తోంది. ఒక చేతిలో ప్లేటు - వేరొక చేతిలో క‌లిపిన ముద్దను కింద వేస్తుంటే సామ్ చుట్టూ చేరిన ఆ పిల్లులు ఎంత ముద్దొస్తున్నాయో? ఇంత‌కీ ఈ దృశ్యం ఎక్క‌డ అంటే .. ఇటీవ‌లే అక్కినేని ఫ్యామిలీ అంతా ఇజుబి అనే అరుదైన ఎగ్జోటిక్ లొకేష‌న్‌ లో చిలౌట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

నాగార్జున‌- అమ‌ల స‌హా నాగ‌చైత‌న్య‌- సామ్ జోడీ ఇజుబిలో ప‌ర్య‌టించారు. వీళ్ల‌తో అఖిల్ - ఫ్యామిలీ స్నేహితుల బృందం జాయిన్ అయ్యారు. మొత్తానికి ఈ ట్రిప్‌ లో స‌మంత ఎంతో రిలాక్స్ అయ్యింద‌నే చెప్పొచ్చు. ఇటీవ‌ల చైత‌న్య‌ను పెళ్లాడాక అస‌లే తీరిక స‌మ‌యం చిక్క‌డం లేదు. వ‌రుస‌గా సినిమాల‌తో ఆన్ లొకేష‌న్ ఒక‌టే కుస్తీలు ప‌ట్టాల్సొచ్చింది. అందుకే అలా ఇజుబిలో రిలాక్స్ టైమ్ చిక్క‌గానే త‌న‌తో ఆడుకోవ‌డానికి విచ్చేసిన మార్జాలాల‌తో అలా హాయిగా ఆడుకుంది సామ్‌.  జీవితంలో ఇంత‌కంటే ఆనంద‌క‌ర‌మైన స‌న్నివేశం వేరొక‌టి రాదు సుమీ! ఆ విన్యాసం చూస్తుంటే హాలీ బెర్రీ `క్యాట్ ఉమెన్` సినిమా గుర్తుకు రాక‌పోదు. అలాంటి ప్ర‌యోగాత్మ‌క కాన్సెప్టుతో సినిమా తీస్తే సామ్ న‌టిస్తుందేమో?
Tags:    

Similar News