త్రివిక్రమ్ సినిమాల్లో ఇదే బెస్ట్ అంటోంది

Update: 2016-03-11 13:09 GMT
కొందరేమో ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటారు. ఇంకొందరేమో ‘పాత ఒక రోత.. కొత్త ఒక వింత’ అంటారు. సినిమా వాళ్లకు ఎక్కువగా కొత్త సామెతే గుర్తొస్తుంటుంది. కొత్త సినిమా రిలీజవబోతుంటే దాని గురించి మరీ అతిగా పొగిడేస్తారు. అంతకుముందు ఎంత మంచి సినిమాలు చేసినా సరే.. నా కెరీర్లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అని స్టేట్ మెంట్లు ఇచ్చస్తారు. ఐతే తమ వరకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఓకే కానీ.. వేరే వాళ్ల విషయంలో కూడా ఇలాంటి తీర్పులిచ్చేస్తేనే కష్టం. క్యూట్ గర్ల్ సమంత ఇదే పని చేస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను నటించిన కొత్త సినిమా ‘అ..ఆ’ గురించి ఓ భారీ స్టేట్మెంట్ ఇచ్చింది సమంత.

‘అ..ఆ’ త్రివిక్రమ్ సినిమాల్లో ది బెస్ట అంటోంది సమంత. ఇందులోని వినోదం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని చెబుతూ.. ఇలాంటి సినిమా ప్రి లుక్ పోస్టరు తన చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేసింది సామ్. ఐతే నిజంగా త్రివిక్రమ్ కెరీర్లో ‘అ..ఆ’ బెస్ట్ సినిమా అవ్వగలదని ఎవరికీ అంచనాల్లేవు. ఆ మాటకొస్తే త్రివిక్రమ్ దీని తర్వాత తీయబోయే సినిమాల్లో ఏదైనా కూడా ఆయన బెస్ట్ ఫిల్మ్ అవుతుందని జనాలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎప్పటికీ ‘అతడు’ కంటే మంచి సినిమాను త్రివిక్రమ్ తీయలేకపోవచ్చేమో. ఇంతకీ సమంత ‘అతడు’ సినిమా చూసిందో లేదో తెలుసుకోవాలి ముందు. ‘అతడు’ సినిమాను పక్కన పెట్టేసినా.. నువ్వే నువ్వే - అత్తారింటికి దారేది లాంటి మంచి సినిమాలు తీశాడు త్రివిక్రమ్. ‘అ..ఆ’ ముందు వాటిని దాటుతుందేమో చూద్దాం. ఆ తర్వాత ‘అతడు’ గురించి ఆలోచిద్దాం. ఏమంటావ్ సామ్?
Tags:    

Similar News