`#RRR`ఆఫ‌ర్ రాలేదు...స‌మంత‌!

Update: 2018-07-22 07:13 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ల కాంబోలో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న`#RRR`పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. 300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ మినహా మిగ‌తా న‌టీన‌టులెవ‌రో ఇప్ప‌టివ‌ర‌కు జ‌క్క‌న్న రివీల్ చేయ‌లేదు. అయితే, ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం...స‌మంత‌ను రాజ‌మౌళి సంప్ర‌దించాడ‌ని,..అందుకు సమంత నో చెప్పింద‌ని ....ఓ వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. డేట్టు స‌ర్దుబాటు చేయ‌లేక‌ ఆ ఆఫ‌ర్ ను  సామ్ సున్నితంగా తిర‌స్క‌రించింద‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆ వార్త‌లపై స‌మంత స్పందించింది. ఆ పుకార్ల‌ను కొట్టిప‌డేసింది. అస‌లు ఆ ఆఫ‌ర్ తో రాజ‌మౌళి త‌న‌ను సంప్ర‌దించ‌నేలేద‌ని చెప్పింది.

`ఈగ‌` సినిమాలో సమంత పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి రాజ‌మౌళి, స‌మంత‌ల కాంబోలో మ‌రో సినిమా రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజా పుకార్ల‌పై స‌మంత స్పందించింది. రాజ‌మౌళి సినిమాలో అవ‌కాశం వ‌స్తే మ‌రో ఆలోచ‌న లేకుండానే ఓకే చెబుతాన‌ని స‌మంత చెప్పింది. అస‌లు రాజ‌మౌళి త‌న‌ను `#RRR`కోసం అప్రోచ్ అవ్వ‌లేద‌ని - ఆ పుకార్ల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని స‌మంత కొట్టిప‌డేసింది.స‌మంత ఇచ్చిన క్లారిటీతో ఇది ఓ రూమర్ అని తేలిపోయింది. ప్ర‌స్తుతం స‌మంత `యూట‌ర్న్` రీమేక్ తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో బిజీగా ఉంది.మ‌రోవైపు`#RRR` సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ ఏడాది చివ‌ర్లో ప్రారంభం కానుంది.
Tags:    

Similar News