సామ్ కు సురేష్ మధ్య బేబీ రగడ?

Update: 2019-06-03 13:06 GMT
వచ్చే నెల విడుదల కానున్న ఓ బేబీకి టీజర్ తర్వాత ఆశించిన మేరకు బజ్ వచ్చేసింది. ఏదో డిఫరెంట్ గా ట్రై చేశారన్న ఫీల్ కలగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దీని మీద మంచి ఆసక్తిగా ఉన్నారు. పైగా రెగ్యులర్ కథాంశం కాకపోవడంతో హైప్ పెరిగింది. ఇదిలా ఉండగా నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు దీని ఫైనల్ కాపీ మీద ఏమంత హ్యాపీగా లేరన్న పుకారు నిన్న మొన్న కాస్త గట్టిగానే షికారు చేసింది.

దీంతో ఇది తెలుసుకున్న సామ్ భర్త పెదమావయ్య సురేష్ కు మెసేజ్ చేస్తూ అలాంటిది ఏమైనా ఉంటె చెప్పమని ఆ భాగం రీ షూట్ చేయిద్దామని కోరిందట. దీనికి ఆశ్చర్యపోయిన సురేష్ బాబు అదేమీ లేదని గాసిప్స్ కి రియాక్ట్ అవ్వకని ఇండస్ట్రీలో కొత్త సినిమా వస్తున్నప్పుడు ఇలాంటివి కామన్ అని సర్దిచెప్పారట. అయినా అనుమానం తీరని సామ్ ఒకటికి రెండు సార్లు పదే పదే అడిగి మరీ క్లారిటీ తీసుకుందట.

ఇది ఎందుకు వచ్చిందో ఎక్కడ ప్రచారం మొదలయ్యిందో కాస్త చూడమని తన టీంకు సురేష్ పురమాయించడం ఫైనల్ ట్విస్ట్ అని ఫిలిం నగర్ టాక్. ఇది నిజమో కాదో కాని ఓ బేబీ ఎక్కడ సురేష్ కు పూర్తిగా నచ్చలేదో అని సమంతా పడిన టెన్షన్ చిన్నది కాదట. ఎందుకంటే దీని మార్కెటింగ్ కేవలం తన ఇమేజ్ మీదే జరుగుతోంది. తన బ్రాండ్ మీదే అమ్ముతున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా భారం తన మీదే పడుతుంది. కష్టపడి చేసిన యుటర్న్ లో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల రిజల్ట్ దక్కలేదు. ఓ బేబీ కూడా అదే తరహాలో రీమేక్ కాబట్టి అవి రిపీట్ కాకూడదని తన తపన. మొత్తానికి పుకార్లు సామ్ సురేష్ ల మధ్య ఇంత డిస్కషన్ కు దారి తీశాయన్న మాట
Tags:    

Similar News