సౌత్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో అక్కడ బాగా పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత వరుసగా రెండు మూడు హిందీ సినిమాలతో పాటు ఒక ఇంగ్లీష్ సినిమాను కూడా కమిట్ అయ్యింది. ఇదే సమయంలో ఒక తమిళ సినిమా ను మరియు తెలుగు లో ఖుషి సినిమాను కూడా ఈమె చేస్తుంది.
తెలుగు లో ఈమె నటించిన శాకుంతలం మరియు యశోద సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు కూడా గ్రాఫిక్స్ వర్క్ లో ఉన్నాయి. ఇదే సమయంలో తెలుగు లో ఎన్టీఆర్ కు జోడీగా నటించే అవకాశం వచ్చిందట. ఎన్టీఆర్ 30 లో సమంత ను నటింపజేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు. గతంలో వీరి ముగ్గురు కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది.
జనతా గ్యారేజ్ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో సెంటిమెంట్ గా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఆమె కూడా మొదట ఎన్టీఆర్ 30 కి ఓకే చెప్పింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 లో ఆమె నటించడం కష్టమే అని తేలిపోయింది.
ఎన్టీఆర్ 30 కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిన విషయం తెల్సిందే. సినిమా ప్రారంభించే సమయంకు సమంత బాలీవుడ్ లో బిజీగా ఉంటుందట. ఇప్పటికే ఆమె కమిట్ అయిన హిందీ సినిమాలకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయట. అందుకే ఎన్టీఆర్ 30 సినిమా లో ఆమె నటించడం సాధ్యం కాకపోవచ్చు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కొరటాల ఇచ్చిన ఆఫర్ ను ప్రస్తుతానికి సమంత హోల్డ్ లో పెట్టింది అనేది సమాచారం. ఎన్టీఆర్ తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా డేట్లు కుదరని కారణంగా నో చెప్పింది అనే ప్రచారం సినీ వర్గాల్లో నడుస్తోంది. ప్రస్తుతానికి కొరటాల శివ ఇంకా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత మరోసారి సమంత తో చర్చలు జరిపి.. అప్పుడు కూడా ఆమె నో చెప్తే మరో హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. సమంత ఇప్పటికే ఎన్టీఆర్ తో పలు సినిమాలు చేసి సక్సెస్ పెయిర్ గా పేరు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ 30 కి మాత్రం వీరి జంట ను చూడటం సాధ్యం కాకపోవచ్చు.