స్టార్ డైరెక్టర్ రాజమౌళి తదుపరి చిత్రం #RRR పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంది. ఇంకా ప్రాజెక్టును అధికారికంగా లాంచ్ చేయకపోయినా రాజమౌళి & కో నుండి వచ్చే అప్డేట్ల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆఫీషియల్ అప్డేట్ల సంగతేమో గానీ ఈ సినిమాపై హైదరాబాద్ లోని ఫిలింనగరంలో ఎన్నో ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.
అందులో ఒకటి ఏంటంటే ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం సమంతాను సంప్రదించారట. కానీ సమంతా ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. రాజమౌళి -ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ సినిమాలో ఆఫర్ ను రిజెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి సమంతా నిజంగానే జక్కన్నకు 'నో' చెప్పిందా లేదంటే ఇది జస్ట్ ఫిలిం నగర్ జనాల క్రియేటివ్ రూమరా తెలియాలంటే మనం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఈ విషయాన్ని పక్కనబెడితే రాజమౌళి టీమ్ ప్రస్తుతం కథపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. వీళ్ళ కసరత్తులిలా ఉంటే రామ్ చరణ్ - తారక్ మాత్రం జిమ్ లో మరో రకం కసరత్తులు చేస్తూ తమ ఫిట్నెస్ ను ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారట.