ఫోన్ పట్టుకోవడానికి భయంగా ఉంది-సమంత

Update: 2018-05-07 09:29 GMT
విశాల్ సరసన తాను నటించిన ‘ఇరుంబు తురై’ (తెలుగులో అభిమన్యుడు) తన కెరీర్లో స్పెషల్ ఫిలిం అంటోంది సమంత. ఈ చిత్రం తన పాత్ర ప్రత్యేకమని.. అలాగే ఈ చిత్ర కథ కూడా చాలా భిన్నమైందని.. ఈ సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు చూశాక తన ఫోన్ పట్టుకోవడానికే భయం వేసిందని సమంత చెప్పింది. ‘ఇరుంబు తురై’ సైబర్ నేరాల నేపథ్యంలో సాగే కథ.

ఫోన్.. పీసీ డేటాలను దొంగిలించి ఒక సైబర్ నేరగాడు కోట్లాది మంది జీవితాలతో ఆటలాడుతాడు. అతడిని అడ్డుకోవడానికి హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. కొత్త దర్శకుడు పి.ఎస్.మిత్రన్ ఎంతో పరిశోధించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని.. ఇందులో కొన్ని సీన్లు చూసి తాను షాకయ్యానని సమంత చెప్పింది. మన ఫోన్లోని సమాచారంతో ఇంత దారుణాలు చేస్తారా అనిపించిందని.. ఆ సీన్లు చూశాక తన ఫోన్ పట్టుకోవడానికి భయం వేసిందని సమంత వెల్లడించింది.

తన కెరీర్లో చాలా స్పెషల్ అనదగ్గ ‘మహానటి’.. ‘ఇరుంబుతురై’ సినిమాలో రెండు రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం చాలా ఉద్వేగం కలిగిస్తోందని.. ఇవి రెండూ విజయవంతం అవుతాయని చాలా ధీమాగా ఉన్నానని సమంత చెప్పింది. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ దివ్యంగా ఉందని.. తనకు ఒక బిడ్డ పుట్టాక కూడా సినీ రంగంలోనే కొనసాగాలని అనుకుంటున్నానని సమంత చెప్పడం విశేషం.
Tags:    

Similar News