టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని అనుభవించిన నటి సమంత. దాదాపు పన్నెండేళ్ల క్రితం ఏం మాయ చేసావే అంటూ ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు ఆడియన్స్ ని అలా మాయ చేసింది. సమంత టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసనా నటించి సూపర్ స్టారిజాన్ని సొంతం చేసుకుంది. ఆమె నాగ చైతన్యతో ప్రేమలో ఉంటూ పెళ్ళి పీటల దాకా నడిచి మూడు ముళ్ళూ వేయించుకున్నా కూడా స్టార్ డమ్ అలాగే ఉంది. అంత వరకూ ఎందుకు ఆమె పెళ్ళి అయిన తరువాత రంగ స్థలం మూవీ చేసి తన జోరు ఎక్కడా తగ్గలేదని నిరూపించుకుంది. ఇక సమంత ఈ రోజుకీ స్టార్ ఇప్పటికీ ఆమెకు గ్లామర్ ఉంది. ఆఫర్లు కూడా వెల్లువలా ఉన్నాయి.
ఇక ఆమె బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తోంది. ఆమె తెలుగులో తాజాగా చేసిన సినిమా శాకుంతలం. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీని దర్శక నిర్మాత గుణ శేఖర్ తీశారు. ఈ మూవీ సమంతకు మళ్లీ టాలీవుడ్ లో లైఫ్ ఇస్తుంది అని అంతా భావిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఈ మూవీని డిజైన్ చేశారు. దాంతో బాలీవుడ్ లో సమంతకు కమ్ బ్యాక్ మూవీగా ఉంటుంది అని కూడా అంచనా వేస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే శాకుంతలం మూవీ కంప్లీట్ గా లేడీ ఓరియెంటెడ్ అని చెప్పాలి. భారతీయ ఇతిహాసం లో ఒక భాగం ఈ కధాంశం. విశ్వామిత్రుడు మేనకల సంతానం అయిన ఆడపిల్లను కణ్వ మహర్షి చేరదీసి శకుంతల అని పేరు పెట్టి పెంచడం, ఆ మీదట దుష్యంతుడు ఆమెని వలచి వరించి వివాహం చేసుకోవడం ఆనక ఆయన ముని శాపం మీద శకుంతలను మరచిపోవడం కధలో ముఖ్య ఘట్టాలు. భర్తకు దూరమై ఒంటరి అయిన శకుంతల భరతుడు అనే కుమారుడిని కని భర్త దుష్యంతుడి కరుణ కోసం వేచి చూడడం, చివరికి ముని శాపం తొలగి రాజు ఆమెను గుర్తించి తమ భార్యగా అంగీకరించడం ఈ చిత్ర కధ.
ఇప్పటిదాకా ఏమో కానీ ఈ మూవీ రిలీజ్ అవుతున్న వేళకు సమంత నిజ జీవితంలో కూడా కొన్ని భారమైన ఘటనలు జరగడంతో ఈ మూవీ మీద హైప్ మరింతగా పెంచేస్తాయని అంటున్నారు. శకుంతల జీవితమే విషాదం. పుడుతూనే కన్న వారికి దూరమై ఆనక భర్త ప్రేమకు దూరమై చివరి వరకూ కడగండ్లు పడిన వనిత కధ. ఆ పాత్ర పోషిస్తున్న సమంత కూడా నిజ జీవితంలో లేటెస్ట్ గా విడాకులు తీసుకున్నారు. చర్చ ఏ వైపు ఎలా ఉన్నా కూడా ఆమె మీద జనాలకు సానుభూతి ఎటూ ఉంటుంది. ఇక ఈ పాత్ర కూడా అంతకు మించి సింపతీని క్రియేట్ చేసేదిగానే ఉంటుంది. వెరసి టాలీవుడ్ లో ఫుల్ లెంగ్త్ లో సమంత చాలా కాలానికి చేసిన ఈ మూవీ రిలీజ్ అయితే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అన్న చర్చ అయితే ఉంది. మొత్తానికి ఒక సమంత, ఒక శాకుంతలం అని చెప్పాలేమో.