సూపర్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన సమంతా

Update: 2020-05-22 08:50 GMT
రానా దగ్గుబాటి - మిహికా బజాజ్ ల ప్రేమ విషయం రానా వెల్లడించడం.. ఇరుకుటుంబాలు కలిసి రోకా ఫంక్షన్ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.  అసలే నెగెటివ్ న్యూసులతో సతమతమవుతున్న జనాలకు ఇలాంటి శుభవార్త నిజంగానే పన్నీటి జల్లులా అనిపించింది. ఇక రానా కుటుంబ సభ్యులైతే చాలా సంతోషంగా ఉన్నారు. రానాకు సోదరి వరసయ్యే సమంతా అక్కినేని కూడా ఈ విషయం పట్ల సంతోషంగా ఉంది.

సమంతా తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రోకా ఫంక్షన్ కు సంబంధించిన ఒక ఫ్యామిలీ పిక్ పోస్ట్ చేసి "2020 కి గానూ ది బెస్ట్ న్యూస్ మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ.  రానా దగ్గుబాటి.. మిహికా బజాజ్ మీరు సంతోషంగా ఉండాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలో రానా - మిహికాలతో పాటుగా నాగ చైతన్య సమంతా.. అభిరామ్.. వెంకటేష్ తనయుడు అర్జున్.. కుమార్తెలు ఉన్నారు.  అందరూ సూపర్ స్మైల్ ఇస్తూ ఈ ఫోటోకు పోజివ్వడం విశేషం.

ఈ ఫోటోలో రానా-మిహికా.. చైతన్య-సమంతాలతో పాటు అర్జున్ దగ్గుబాటి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అన్నయ్య రానా లాగే అర్జున్ పొడవుగా ఉన్నాడని త్వరలో హీరో అవుతాడని అప్పుడే ఫ్యాన్స్ లో చర్చలు మొదలయాయి.
Tags:    

Similar News