ఫోటో స్టొరీ: మెరూన్ కలర్ లో మెస్మరైజ్ చేస్తోంది

Update: 2019-02-03 06:52 GMT
కాలం మారింది.  నిన్నేమో రెజినా కసాండ్రా మాట్లాడుతూ లవ్ లో చాలా రకాలున్నాయి.. జనాలు అర్థం చేసుకోవాలి అని శెలవిచ్చింది.  మరి ఎంతమంది అర్థం చేసుకుంటారో.. ఎంతమంది అపార్థం చేసుకుంటారో ఎంతమందికి ఆమె చెప్పినదానిలో అర్ధభాగమే అర్థం అవుతుందో తెలీదు.  అదంటే మరీ హాటు టాపిక్.. దాని కంటే కొంచెం హీటు తక్కువగా ఉన్న మరో టాపిక్ ఉంది.

ఆదే శ్రీమతులు హాటుగా కన్పించడం.  గతంలో పెళ్ళికి ముందు ఎంత హాటుగా.. ఘాటుగా ఉన్నప్పటికీ పెళ్ళైన తరవాత మాత్రం హీరోయిన్లు హిందీ ఫ్యామిలీ సీరియల్స్ లో కనిపించే మహిళల మాదిరిగా మారిపోయేవారు. ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు ఎంత హాటుగా ఉంటున్నారో అదే హాటో మీటర్ పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గునపాలు దించుతున్నారు.   ఈమధ్య సమంతా కూడా అదే రూటులో హాటు ప్రదర్శనలకు సై అంటోంది.  తాజాగా శిల్పారెడ్డి కలెక్షన్స్ దుస్తులలో ఫోటో షూట్ చేసింది.

మెరూన్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చిన సమంతా ఒక సెన్సువల్ పోజిచ్చింది. మెడలో పొట్టిగా ఉండే ఒక ముత్యాలహారం లాంటిది వేసుకుంది.  షార్ట్ హెయిర్..  కర్లీగా స్టైలింగ్ చేయడంతో  ఒక మోడల్ లాంటి లుక్ వచ్చింది.   అందమైన కాళ్ళ ప్రదర్శన .. క్లీవేజ్ షో సరేసరి. ఏదైతేనేం.. సమంతా ఈ జెనరేషన్ బ్యూటీ అనిపించింది.


Tags:    

Similar News