ప్రోగ్రెస్ రిపోర్టు మీద తల్లిదండ్రుల సంతకం తప్పనిసరి. స్కూల్లో మాష్టారుకి సంతకం ఉన్న రిపోర్టు చూపించకపోతే బెత్తం విరిగిపోద్ది. అలాగే ఎవరైనా సెలబ్రిటీ ట్విట్టర్‌లో ఖాతా ఓపెన్ చేస్తే దానికి ట్విట్టర్ ప్రతినిధుల నుంచి సంతకం తీసుకోవాల్సిందే.
ఒక టిక్కు మార్కు ఒకటి బులుగు రంగులో పేరు పక్కనే పెడతారు. అదంతా ఆన్‌టైన్ వెరిఫికేషన్ టీమ్ చేసే పని. వాస్తవానికి సదరు ఖాతాని ఒరిజినల్ సెలబ్రిటీ తెరిచిందేనా? లేక ఎవరైనా ఆ పేరును మిస్ యూజ్ చేస్తూ ఖాతా తెరిచారా? అన్నది వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ ఖాతా నాది కాదు అని సదరు సెలబ్ వెరిఫికేషన్ టీమ్‌కి చెబితే వెంటనే దానిని బ్లాక్ చేసేస్తారు. అయితే ట్విట్టర్‌లో దాదాపు 10లక్షల ఫాలోవర్స్ ఉన్న సమంత ఇంకా తనకి బులుగు సంతకాన్ని తీసుకోనేలేదు. మహేష్, పవన్, రజనీకాంత్ లాంటి స్టార్ల ట్విట్టర్ ఖాతాలకు ఇప్పటికే బులుగు సంతకం ఉంది.
కానీ సమంత ఖాతాకి ఇంకా టిక్ మార్కు పెట్టనేలేదు. గతంలో సమంత పేరుతో ఓ ఖాతాని వేరొకరు తెరచి అవాంఛనీయ సమాచారాన్ని పోస్ట్ చేసేవారు. దాంతో ఆ ఖాతాని మూయించారు. దానిని దృష్టిలో పెట్టుకునే ఇంకా ట్విట్టర్ టీమ్ స్పందించలేదేమో? అనే సందేహాలొస్తున్నాయి. సమంత చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందున్నమాట!