ఆ రోల్స్ ఎవరిస్తారు సమంత??
''రొటీన్ రోల్స్ చేసిచేసి చిరాకొచ్చేసింది. నేను కొత్తగా ఏదన్నా చేయాలని అనుకుంటున్నా. కేవలం నా పాత్రలో దమ్ము ఉంటేనే ఇక నుండి సినిమాలు ఒప్పుకుంటాను. లేకపోతే ఈ కమర్షియల్ మసాలా సినిమాలు మాత్రం చేయను'' అంటూ చెప్పేసింది సమంత. సర్లేండి.. డైలాగ్ ది ఏముంది.. తనకు చెప్పాలని అనిపించింది చెప్పేసింది. మరి అలాంటి రోల్స్ ఎవరిస్తారు అమ్మడికి?
నిజానికి సినిమాలు వేరైనా కూడా.. సమంత యాక్టింగ్ మాత్రం ఒకేలా ఉంటుందనేది నిజం. దానికితోడు.. డబ్బింగ్ చెప్పే చిన్మయి కూడా అన్ని పాత్రలకూ ఒకటే మాడ్యులేషన్ తో డబ్బింగ్ చెబుతుంది కాబట్టి.. దాదాపు అన్ని సినిమాల్లోనూ ఒకేలా అనిపిస్తోంది మనకు. అయితే ఇప్పటికిప్పుడు సడన్ గా తన కారణంగా నడిచే సినిమా కథలు తనకు ఎవరిస్తారు చెప్పండి? ఎక్సక్లూజివ్ గా ఉమెన్ ఓరియెంటడ్ సినిమాలంటే.. మన దగ్గర చాలా రేర్ గా వస్తుంటాయి. ఎప్పుడో అరుంధతి.. ఆ తరువాత ఒక్క సినిమా కూడా ఆ టైపులో క్లిక్కవ్వలేదు. మొన్ననే సైజ్ జీరో కూడా ఫ్లాపైంది.
ఇలాంటి తరుణంలో.. తనకు వచ్చిన రొటీన్ సినిమాల్లోనే సమంత కాస్త కొత్తగా ఏదన్నా ప్రయత్నిస్తే బాగుంటుంది. అదిగో నిత్యామీనన్ వంటి భామలు తమకు ఆఫర్ చేసిన రొటీన్ చక్రంలోనే కొత్తగా ఏదేదో చేస్తూ తళుక్కుమనడం లేదూ? ఆలోచించుకో స్యామ్.