సమంత ప్రధాన పాత్రలో హరీష్.. హరి దర్శక ద్వయం దర్శకత్వంలో రూపొందిన యశోద సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది. యశోద సినిమా నుండి ఇటీవలే టీజర్ వచ్చింది. సినిమాలో సమంత ప్రెగ్నెంట్ గా కనిపించబోతున్నట్లుగా టీజర్ ను బట్టి క్లారిటీ ఇచ్చారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు దీపావళి సందర్భంగా సమంత తన యశోద సినిమా యొక్క ట్రైలర్ అప్‌డేట్ ను రివీల్ చేసింది. అక్టోబర్ 27వ తారీకున యశోద సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా నేపథ్యం చాలా విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ తోనే తేల్చి చెప్పారు. సమంత రెగ్యులర్ కమర్షియల్ పాత్రలకు పూర్తి దూరంగా ఈ సినిమా లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
సమంత అభిమానులు టీజర్ చూసిన తర్వాత కొందరు నిరుత్సాహం వ్యక్తం చేశారు. సినిమా మొత్తం సమంతను ఇలాగే చూడాల్సి ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు మాత్రం సమంత ను అన్ని రకాలుగా యశోద లో చూస్తామనే నమ్మకంతో ఉన్నారు. ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమా పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

I’ll be seeing you ♥️ #YashodaTrailer on 27th Oct @ 5.36 PM