‘ఛోటా మేస్త్రీ’ని డిసైడ్ చేసిన సంపత్

Update: 2015-12-09 01:30 GMT
బ్రూస్ లీ తరువాత ఏ సినిమా చేయాలో రామ్ చరణ్ ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదు. తమిళంలో హిట్టయిన ‘తన్ని ఒరువన్’ని రీమేక్ చేయాలని చూస్తున్నా... ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా టైం పట్టేలా వుంది. కాస్టింగ్ క్రూ ప్రాబ్లమ్స్ తో ఈ సినిమా లేట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే.. రామ్ చరణ్ ని ‘ఛోటా మేస్త్రీ’ చేయడానికి సంపత్ నంది రెడీ అయిపోతున్నాడు. బెంగాల్ టైగర్ సినిమా విడుదలైన తరువాత సంపత్ నంది ఈ సినిమాపైనే దృష్టి సారించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సంపత్ నందే వెల్లడించడంతో... మరోసారి చెర్రీతో కలిసి సంపత్ సినిమా కన్ ఫర్మ్ అయిందని తెలిసిపోయింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘రచ్చ’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సో.. రామ్ చరణ్ తో మళ్లీ సినిమా చేసే ఛాన్స్ సంపత్ దక్కించుకున్నాడు. ఈ మేరకు చెర్రీ నుంచి హామీ కూడా తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ‘ముఠామేస్త్రీ’ సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు చెర్రీ... ఛోటా మేస్త్రీగా రాబోతున్నాడన్నమాట. మరి ముఠా మేస్త్రీలోలాగ.. డ్యాన్సలు, ఫైట్లు, డైలాగులతో చెర్రీ ఎలా విజృంభిస్తాడో చూడాలి.

అయితే ఈ సినిమాను ఏ బ్యానర్ పై నిర్మించేది.. అందులో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదట. బెంగాల్ టైగర్ తరువాత సంపత్ నంది... పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాలున్నాయని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా సంపత్ నంది చేసిన వ్యాఖ్యలు చూస్తే... ఇప్పట్లో సంపత్ నంది, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా వుండే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ నిర్మాత అయ్యే అవకాశం వుందేమో చూడాలి.
Tags:    

Similar News