సోషల్ మీడియాలో హల్ చల్ చేసి బర్నింగ్ స్టార్ అయిపోయిన సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా పోస్టర్ వచ్చేసింది. ఆండ్రాయిడు అంటూ ప్రీ రిలీజ్ లుక్ తర్వాత.. ఇప్పుడీ పోస్టర్ ను పూర్తిగా రివీల్ చేశారు. కొబ్బరిమట్ట మూవీలో ఇంట్రడ్యూసింగ్ యాండ్రాయిడు అంటూ.. సంపూర్ణేష్ బాబు బైక్ పై కూర్చున్న ఓ ఫోటోను విడుదల చేశారు. కొబ్బరిమట్ట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సంపూ మూవీని కూడా స్పూఫ్ లను బేస్ చేసుకునే తీస్తున్నారని చెప్పచ్చు.
ఈ చిత్రంలో పలు గెటప్ లలో సంపూర్ణేష్ కనిపించనున్నాడు. మొదట మోహన్ బాబు మూవీ పెదరాయుడు, అదే సినిమాలో పాపారాయుడు లుక్ తో దర్శనమిచ్చిన సంపూర్ణేష్ .. ఆ తర్వాత బాహుబలిలో సీన్ ని కూడా ఇమిటేట్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్ వేసేశారు. ఇప్పుడు ఓ కాస్ట్లీ బైక్ పై కూర్చున్న సంపూర్ణేషే.. తన స్టైల్లో అందరినీ విష్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో పెదరాయుడు నుంచి మొదలుపెట్టి.. బాహుబలి - లేటెస్ట్ సరైనోడుని కూడా వదలకుండా.. స్పూఫ్ లు, పంచ్ లు వేసుకుంటూ సినిమా తీసేస్తున్నట్లు అర్ధమవుతోంది.
ఈ సారి కూడా బాక్సాఫీస్ దగ్గర సంపూ హంగామా ఎక్కువగానే ఉండొచ్చని ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. ఫ్రం ది మేకర్స్ ఆఫ్ హృదయకాలేయం, ఈ రోజుల్లో అంటూ చేస్తున్న పబ్లిసిటీ వర్కవుట్ అయ్యేలాగే ఉంది. ఈ కొబ్బరిమట్టకు దర్శకత్వం రూపక్ రొనాల్డ్ రాస్ - కథ - స్క్రీన్‌ప్లే - మాటలు స్టీవెన్ శంకర్ అందిస్తున్నారు..