ఈ మధ్యనే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 'సింగం 123' సినిమాతో విచ్చేశాడు. సినిమా అట్టర్ ఫ్లాప్. కథ స్వయంగా మంచు విష్ణు రాసి, తనే నిర్మించాడు కూడా. అయినా అది అట్టర్ ఫ్లాపే. ఇక విడుదలై ఒక వారం అయ్యిందో లేదో సినిమా మొత్తంగా చూస్కోండి అంటూ వీడియోను యుట్యూబ్లో పెట్టేశాడు విష్ణు. మొన్నటివరకు ధియేటర్స్‌లో టిక్కెట్టు కొనుక్కుని ఎందుకులే చూడటం అనుకున్న అభిమానులు, ఖాళీ సమయంలో ఇంటర్నెట్లో హ్యాపీ చూసేశారు. చూశాక రియాక్షన్ ఏంటో తెలుసా?
ఈ మధ్యనే సంపూ ఒక టివి షో కి విచ్చేశాడు. లైవ్ ప్రోగ్రాంకు కాల్ చేసిన ఒక నందమూరి అభిమాని, అసలు బాలయ్యను నీ ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నావ్ ఎందుకు అంటూ కాస్త గట్టిగానే అడిగాడు. 'ఏమైంది ఇప్పుడు.. అది బాగానే ఉందిగా..'' అంటూ సమాధానం చెప్పిన సంపూ.. కాస్త ఓవర్ చేస్తున్నాడే ఈ కొత్త హీరో అనుకునేలోపే మరో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ''మొన్న ఆ లెజండ్ ఇమిటేషన్ సీన్స్ బాలయ్య కూడా చూశారు. అన్నయ్య ఎలా ఉంది పర్లేదా అని అడిగితే, పర్లేది ప్యారడీ అనేది కూడా ఒక మాంచి కామెడి అంటూ మెచ్చుకున్నారు'' అని చెప్పుకొచ్చాడు. ఇక్కడితో ఆగలేదండోయ్ గురుడు.
''నాకు ఇలాంటి ఫ్యాన్స్ వార్నింగులు మామూలే. కాయలున్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవ్'' అంటూ లాస్ట్‌లో కలరింగ్ ఇచ్చాడు. బాబుగారూ.. రెండు సినిమాల్లో నవ్వించేసి ఫేస్బుక్లో బీభత్సమైన పబ్లిసిటీ తెచ్చేసుకున్నంత మాత్రం కాయలున్న చెట్టు అనేసుకుంటే ఎట్టా? టాలెంట్ ఉంది ఓకె. కాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే కష్టం రాజా!!