సినిమా ఏమన్నా తీసేదుందా సంపూ..

Update: 2016-02-20 19:30 GMT
ఆండ్రాయుడు.. పాపారాయుడు.. కొబ్బరిమట్ట.. ఇలాంటి పేర్లతో జనాలను ఊరించడమే కాని.. అసలు సరైన సినిమాతో ఇప్పటివరకు మళ్లీ రాలేదు సంపూర్ణేష్‌ బాబు. తొలి సినిమా ''హృదయకాలేయం''తో.. రాజమౌళి ట్వీటు సపోర్టుతో.. తెలుగు సినిమా లవర్స్‌ లో బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించిన ఈ వెరైటీ స్టార్‌ ఇప్పుడు ఏ సినిమాతో వస్తున్నాడు ఇంతకీ?

సినిమాతో రావడం ఏమో కాని.. బర్నింగ్‌ స్టార్‌ మాత్రం ఎక్కువగా సొంత ప్రమోషన్‌ లో పడ్డాడు. ఎక్కడో ట్రాఫిక్‌ సిగ్నల్‌ లో ఫైన్‌ కడుతూ.. లేకపోతే ఎవరైనా పెద్ద పొలిటిషయన్‌ ను కలసి ఫోటో దిగుతూ.. మొదలగు సంఘటనలను.. సన్నివేశాలనూ ట్వీట్లేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు సంపూ. ఖాళీగా ఉంటే కాస్త యాక్టింగ్‌ మీదనా.. కాస్త మంచి కథల మీదనా.. ఫోకస్‌ పెట్టి.. ఏదన్నా మాంచి సినిమాతో వచ్చి హిట్టు కొట్టేది పోయి ఇలా ప్రమోషన్లతో సరిపెట్టేసుకుంటున్నాడు సంపూ.

ఒకసారి స్పూఫ్‌ లు తీసి అలరించేశాం కదా అని మళ్ళీ అవే తీసిన జనాలు చూడరు. అందుకు అల్లరి నరేష్‌ పెద్ద ఎగ్జాంపుల్‌. ఈ తరుణంలో మరి బర్నింగ్‌ స్టార్‌ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడో చూద్దాం.


Tags:    

Similar News