సంపూ.. అదిరిపోయే పంచ్ ఇచ్చాడులే

Update: 2016-03-18 07:01 GMT
కమల్ ఆర్.ఖాన్.. బాలీవుడ్ లో ఇతనో ఐటెం టైపు. పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేసే పూనమ్ పాండే - రాఖీ సావంత్ లాంటి వాళ్లకు.. ఇతడికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం.. అటెన్షన్ కోసం ప్రయత్నించడం.. సెలబ్రెటీల్ని టార్గెట్ చేసి.. వాళ్లు తిరిగి రెస్పాండైతే మంచి పబ్లిసిటీ వచ్చిందని సంబరపడటం.. ఇదీ అతడి వరస. తనకు తాను పెద్ద క్రిటిక్ అని ఫీలైపోతుంటాడు. బాలీవుడ్ జనాలు చాలా వరకు ఇతణ్ని పట్టించుకోరు కానీ.. అప్పుడప్పుడూ హద్దులు దాటితే గట్టిగా వాయించి వదిలిపెడుతుంటారు.

ఐతే ఈ మధ్య బాలీవుడ్డోళ్లు అస్సలు పట్టించుకోవడం లేదని.. టాలీవుడ్ మీద పడ్డాడు. బాహుబలి విడుదలైనపుడు ప్రభాస్ - రానాల మీద.. ఆ సినిమా మీద అవాకులు చెవాకులు పేలిన కమల్.. లేటెస్టుగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. కమల్ కోరుకున్నట్లే పవన్ అభిమానులు ఎదురుదాడి చేయడంతో.. మీడియా అతడి వ్యాఖ్యలపై వార్తలు రాయడంతో కోరుకున్న పబ్లిసిటీ వచ్చేసిందని సంబరపడుతున్నాడు. ఐతే ఈ పిచ్చి మారాజుకి మన సంపూ భలే రిటార్ట్ ఇచ్చాడులెండి. పవన్ కళ్యాణ్ ను కార్టూన్ అనడంపై స్పందిస్తూ.. ‘‘అవును.. ఆయన కార్టూనే. బ్యాట్ మెన్ టైపు. నైస్ టు మీట్ యు స్నూపీ’’ అంటూ కమల్ ను కుక్కపిల్లను చేసేశాడు సంపూ. ఈ ట్వీట్ చూసి పవన్ అభిమానుల్లో భలే హుషారు పుట్టించింది. భలే ఇచ్చావ్ రిటార్ట్ బాసూ అంటూ సంపూని ఆకాశానికెత్తేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
Tags:    

Similar News