సంపూర్ణేశ్ బాబుకు గాలికి ఎందుకు చెడింది?

Update: 2016-11-03 04:46 GMT
మైనింగ్ బ్యారెన్ గాలి జనార్ద‌న్ రెడ్డి కూతురు వివాహం ఒక్కో సారి ఒక్కో ర‌క‌మైన స‌మాచారంతో వార్త‌ల్లో నిలుస్తోంది. రైజింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ద్వారా తాజాగా ఈ అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అట్ట‌హాసంగా త‌న కూతురు వివాహం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న గాలి జనార్ద‌న్ రెడ్డి ఈ క్ర‌మంలో అదిరిపోయే ఆహ్వాన ప‌త్రిక‌ను రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆహ్వానాన్ని సినీ ప్ర‌ముఖులంద‌రికీ ఇస్తున్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఇదే క్ర‌మంలో సినీ హీరో సంపూర్ణేశ్‌కు సైతం ఆహ్వానం ఇచ్చారు.

త‌న‌కు అందిన ఆహ్వాన పత్రిక‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి సంపూర్ణేశ్ సంతోషం పంచుకున్నారు. "గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కూతురు వివాహ ఆహ్వాన ప‌త్రిక‌ను అందుకోవ‌డం సంతోషక‌రం. వారి కుటుంబం సంతోషానికి నేనెప్పుడూ బానిస‌ను" అంటూ త‌న ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే స‌రిగ్గా ఒక్క‌రోజు తిరిగే స‌రికి సంపూర్ణేశ్ బాబు స‌ద‌రు పోస్ట్‌ను డెలిట్ చేశారు. సంతోషంగా త‌న‌కు వ‌చ్చిన ఆహ్వానాన్ని పోస్ట్ చేసిన సంపూర్ణేశ్ తిరిగి ఒక్క రోజు తిరిగే స‌రిక‌ల్లా త‌న ఆనందాన్ని ఎందుకు ప‌క్క‌న పెట్టేశార‌నేది స‌స్పెన్స్ లాగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News