సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రొడక్షన్ హౌస్ ల గేట్ల ముందు నిలబడిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే స్టూడియోలలో ఒక హీరోగా మర్యాదలు అందుకున్నాడు. ఎంతో కష్టపడి హృదయ కాలేయం సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఊహించని సక్సెస్ అందుకున్న సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత కేవలం కథానాయకుడుగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు ఇతర హీరోల సినిమాలలో గెస్ట్ రోల్స్ సపోర్టింగ్ రోల్స్ చేశాడు.
2015లో మంచు విష్ణు దర్శకత్వంలో సింగం 1 2 3 అనే సినిమా అయితే కాస్త బజ్ క్రియేట్ చేశాడు. అయితే అతను మొదటి సక్సెస్ అందుకున్నంత రేంజ్ లో మరో సినిమాతో సక్సెస్ అందుకోలేదు. తన మొదటి దర్శకుడు రాజేష్ ప్రొడక్షన్ లోనే చేసినటువంటి కొబ్బరి మట్ట సినిమా పరవాలేదు అనిపించింది. కానీ ఆ తర్వాత ఎలాంటి సినిమా చేసినా కూడా సక్సెస్ కాలేదు. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంపూ డిఫరెంట్ గా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ అవి కాస్త రోటిన్ గా మారిపోతున్నాయి అనే కామెంట్స్ కూడా వచ్చాయి. పోనీ డిఫరెంట్ గా ట్రై చేద్దామంటే తన బాడీ లాంగ్వేజ్ కి ఎక్కువగా కామెడీ సినిమాలు సెట్ అవుతాయి అనే తరహా బ్రాండ్ అయితే సెట్ చేసుకున్నాడు. ఆ బార్డర్ దాటి రావాలి అంటే ఎవరైనా పేరును దర్శకుల చేతిలో పడితే సంపూ కెరీర్ మారే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా అతను చేసిన కాలీఫ్లవర్ బజార్ రౌడీ అనే సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడితోనే సంపూర్ణేష్ బాబు ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే హృదయకాలేయం దర్శకుడు రాజేష్ తోనే మరో సినిమా చేయాలి అని చర్చలు జరుపుతున్నారు. సంపూర్ణేష్ బాబు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా కూడా ప్రేక్షకుల్లో అతనికి మంచి పాజిటివ్ సపోర్ట్ అయితే ఉంది.
ఆడియెన్స్ ను అతను పలకరించే విధానం చూపించే ప్రేమ కూడా అతనికి మంచి గుర్తింపును అందించింది. హృదయ కాలేయం లాంటి మరో మంచి సినిమా పడితే అతను ఇండస్ట్రీలో ఇంకాస్త బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి సక్సెస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.