సంయుక్త పేరు పక్కన తండ్రి పేరు ఎందుకు ఉండదు?

Update: 2023-05-15 05:00 GMT
అగ్రహీరోలతో సినిమాలు చేయటం.. బ్లాక్ బస్టర్ మూవీలో నటించటం.. అద్భుతమైన పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే లక్కీ హీరోయిన్లు కొద్ది మంది చూస్తుంటాం. అందుకు భిన్నంగా చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి.. మెట్టు మెట్టు ఎక్కుతూ అగ్రహీరోలతో అవకాశాల్ని సొంతం చేసుకోవటమే కాదు.. క్రేజీ హీరోయిన్ గా మారిన నటీమణులు తక్కువమందే కనిపిస్తారు.

ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు నటి సంయుక్త. చారెడు కళ్లతో చూసినంతనే అయస్కాంతం లాంటి చూపుతో యూత్ గుండెల్ని ఉక్కిరిబిక్కిరిచేస్తున్న ఈ బ్యూటీ తనకు సంబంధించిన పలు విషయాల్ని చెప్పుకొచ్చింది.

'సార్' సినిమాతో అందరి మదిలో రిజిస్టర్ అయిన ఆమె.. ఇటీవల విడుదలైన విరుపాక్ష మూవీలో ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకులు కొత్త థ్రిల్ కు గురి కావటం ఖాయం. ఈ తరహా పాత్రల్ని చేయటానికి గ్లామర్ హీరోయిన్లు సంకోచించే వేళ.. అందుకు భిన్నంగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకునే పరిస్థితి.

ఈ సినిమా అంచనాలకు మించిన సక్సెస్ కావటంతో ఆమె లక్కీ హీరోయిన్ గా మారింది. తనను తాను సమంత వీరాభిమానిగా చెప్పే ఆమె.. తాను టెన్త్ లో ఉన్నప్పుడు  బస్సులో ధనుష్ నటించిన ''ఆడుగళం' సినిమాలోని  పాటల్ని చూసి.. స్టెప్పుల్ని ప్రాక్టీస్ చేసేదానినని చెప్పింది.

అలాంటి తనకు ఏకంగా ధనుష్ పక్కన నటించే అవకాశం రావటం తన లక్ గా ఆమె చెబుతారు. తనకు నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలంటే ఇష్టమని చెప్పే సంయుక్తకు.. కోపం ఎక్కువేనని చెప్పింది. ఒకసారి తాను.. తన తల్లి కలిసి బయటకు వెళుతుంటే.. ఒక వ్యక్తి సిగిరెట్ కాల్చి.. పొగ తమ మీద వదిలాడని.. దీంతో కోపంతో అతడి చెంప పగటకొట్టిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారని.. అందుకే తండ్రి పేరును తన పేరులో నుంచి తీసేసినట్లు చెప్పారు. తనకు జర్నీలంటే ఇష్టమని.. హిమాలయాలకు వెళ్లటం అప్పుడప్పుడు చేస్తుంటానని.. ఖాళీ వేళల్లో కవితలు రాస్తుంటానని చెప్పింది. మొత్తానికి గ్లామర్ హీరోయిన్ చెప్పే మాటలకు సంబంధం లేకుండా ఉన్న సంయుక్త మాటలు ఆమె మీద మరింత అభిమానం పెరిగేలా చేస్తున్నాయని చెప్పాలి.

Similar News