వ్వాట్ డేనియ‌ల్ ల‌వ‌ర్ ఇంతందంగానా?

Update: 2022-07-20 05:19 GMT
2021లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సంయుక్త మీనన్. ఇందులో ఆమె రానా దగ్గుబాటి సరసన కథానాయికగా నటించింది. అందానికి అందం న‌ట‌ప్ర‌తిభ ఉన్న నాయిక‌గా పేరు తెచ్చుకుంది. డేనియ‌ల్ (రానా) వైఫ్ పాత్ర‌లో  డైనమిక్ నటనకు ప్రశంసలు అందుకుంది.

2022లో పృథ్వీరాజ్ 'కడువ'తో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఇప్పుడు ధనుష్ ద్విభాషా చిత్రం వాతి (SIR).. కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మూవీ 'బింబిసార'.. క‌న్న‌డ‌లో గాలిపాట 2 చిత్రాల్లో న‌టిస్తోంది.

కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయింది సంయుక్త‌.2016లో పాప్ కార్న్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సంయుక్త సూపర్ హిట్‌ చిత్రం 'తీవండి'లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో వెల్లం-ఆనుమ్ పెన్నుమ్ చిత్రాలతో నెమ్మ‌దిగా నిల‌దొక్కుకుంది. సంయుక్త కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.

భీమ్లా నాయ‌క్ - క‌డువ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు త‌న‌ని గోల్డెన్ లెగ్ గా మార్చాయ‌న‌డంలో సందేహం లేదు. సంయుక్తకు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇక ఇదే అద‌నుగా ఈ బ్యూటీ కూడా సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో అద‌ర‌గొడుతోంది. తాజాగా తన ఫోటోషూట్ చిత్రాలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పంచుకుంటూ, సంయుక్త తన కెరీర్ పయ‌నంపై ఆనందాన్ని వ్యక్తం చేసింది.

కడువ విజయంతో భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి ఉత్సాహంగా ఉన్నాను! అంటూ హ్యాపీనెస్ ని వ్య‌క్తప‌రిచింది. తాజా ఫోటోషూట్ కి ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. గుబులు గుబులుగా అందంగా..! క‌నిపిస్తోందంటూ ఒక అభిమాని కీర్తించ‌గా.. ఆ పెద‌వి అంచుపై పుట్టుమ‌చ్చ అందం అంటూ ఒక అభిమాని పొగిడేశాడు.

ట్రెడిష‌న‌ల్ లుక్ లోనూ ఇంత హాట్ గానా? అంటూ మ‌రో ఫ్యాన్ అభిమానం కురిపించాడు. మొత్తానికి సంయుక్త‌కు తెలుగు అభిమానుల ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోంది. మునుముందు టాలీవుడ్ లో వ‌రుస చిత్రాల్లో న‌టించేందుకు సంయుక్త క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News