భూమిక - భరత్ ఠాకూర్ చలవతో హీరో అయ్యాడు హర్షవర్ధన్ రాణే. చూడటానికే కాదు రియాలిటీలోనూ రాణే ఉత్తరాది కుర్రాడే. కానీ వన్ ఫైన్ డే భూమిక నిర్మాతగా మారి నిర్మించిన తెలుగు సినిమా తకిట తకిటతో హీరో అయిపోయాడు. మనవాళ్లు స్మార్ట్ గా ఉన్నాడు కానీ తెలుగు కుర్రాడిలా లేడే అనుకున్నారు. కారణం ఏదైనా అతడు నటించిన తొలి తెలుగు సినిమా డిజాస్టర్.
అయినా అతడిలోని పొటెన్షియాలిటీపై నమ్మకంతో వరుసగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసే దర్శకనిర్మాతలు దొరికారు. నీలకంఠ మాయ - రవిబాబు అవును సిరీస్‌లో ఛాన్సులిచ్చి ఛాన్సిచ్చి ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఇతగాడు బాలీవుడ్ వెళ్లి అక్కడ ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించేశాడు. సనమ్ తేరే కసమ్. టైటిల్ ఇంట్రెస్టింగ్. అలనాటి మేటి క్లాసిక్ తేరే సనమ్ తరహాలో ఈ మూవీకి కూడా బాగానే క్రేజు వచ్చింది. హర్షవర్ధన్ కి ఇది బాలీవుడ్ లో తొలి ప్రయత్నం. అతడితో పాటే మౌరా హోకేన్ అనే కొత్తమ్మాయ్ పరిచయం అవుతోంది. కాబట్టి ఇద్దరికీ ఇది ఎంతో కీలకమైన సినిమా.
రాధికారావు - వినయ్ సప్రు సంయుక్తంగా దర్శకత్వం వహించిన సనమ్ తేరే కసమ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చాలా ఇంటెన్స్ ప్రేమకథే ఈ సినిమా అని చెప్పకనే చెబుతోంది. ఒక విధంగా చూస్తే టెరిఫిక్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు తెరపై చూస్తే కాని రిజల్టు చెప్పలేం. అయితే ఈ మూవీ సక్సెస్ పై ఆధారపడి ఈ నవతరం హీరో కెరీర్ ముందుకు సాగుతుంది. వెయిట్ అండ్ సీ.