హర్షవర్దన్ రాణే బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. సనమ్ తేరే కసమ్ అనేది టైటిల్. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఇందులో హీరో కంటే హీరోయిన్ డామినేషన్ ఎక్కువగానే ఉందన్న టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమలో కథానాయికగా నటించింది ఓ పాకిస్తానీ గాళ్. తను హర్ష కంటే బాగా పాపులర్ అయిన అమ్మడు. పేరు మావ్రా హొకేన్. ఒక్కసారి గూగుల్ చేయండి.. ఈమె పాపులార్టీ ఏంటో తెలుస్తుంది.
పాకిస్తానీ టీవీ చానెళ్లలో వీజేగా పాపులర్ అయిన ఈ అమ్మడు అప్పట్లో సైఫ్ అలీఖాన్ 'ఫాంటమ్' పాకిస్తాన్ రిలీజ్ ని సపోర్ట్ చేసింది. తీవ్రవాది ఎక్కడైనా తీవ్రవాదే.. అంటూ తన మనసులో ఉన్న మాటను తూటాలా పేల్చేసి పాకిస్తానీల ఆగ్రహానికి గురైంది. అక్కడ ఆగ్రహం వెల్లువెత్తినా ఇక్కడ బాలీవుడ్ ని మాత్రం ఓ రేంజులో తాకింది అమ్మడి మాట. సరిగ్గా ఇదే ఇప్పుడు బాలీవుడ్ అవకాశాన్ని తెచ్చిపెట్టింది మరి. స్వదేశం పొమ్మన్నా - పరదేశం రమ్మంది. అలా బాలీవుడ్ లో అడుగు పెట్టింది అమ్మడు.
ఈ పోష్ గాళ్ సూటిగా ఉన్న విషయాన్ని ఉన్నట్టే మాట్లాడేస్తుంది. చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తుంది. ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలో హర్షవర్ధన్ ని డామినేట్ చేసే రేంజులో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ట్రైలర్ లోనే ఆ సంగతి అర్థమైంది. ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్ లో పాగా వేసినట్టే. అట్నుంచి తెలుగు - తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి. కాని ఇంతలో ఈమె చేస్తున్న ఎక్స్ పోజింగ్ గురించి కన్జర్వేటివ్ దేశమైన పాక్ లో ఎలాంటి రచ్చ చేస్తారో జనాలు!!
Full View