వర్మలో కొన్ని బ్యాడ్ క్వాలిటీస్‌తో పాటు గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. చెడ్డ లక్షణాలను తిట్టినప్పుడు మంచి లక్షణాల్ని కూడా పొగడాలి. లేదంటే బ్యాలెన్స్ చేసినట్టు కాదు. అందుకే అతడిలోని మంచి లక్షణాలను ప్రస్థావిస్తున్నాం. సౌండ్ పరిజ్ఞానంలో వర్మని కొట్టేవాడే లేడు. హాలీవుడ్ స్థాయి సాంకేతికతను ఈ విషయంలో ఉపయోగించడం అతడి ప్రత్యేకత.
అలాగే కాస్టింగ్ సెలక్షన్ విషయంలో, కథల ఎంపిక విషయంలో, ప్రయోగాల్లో అతడిని కొట్టేవాడే లేడు. ముఖ్యంగా అతడు హీరోల ఎంపిక, హీరోయిన్‌ల ఎంపిక యాధృచ్ఛికంగానే జరిగిపోతుంటుంది. అలా ఎంపికైన బోలెడుమంది తారలు నేడు పెద్ద స్థాయికి ఎదిగిపోయారు. అప్పట్లో ఎక్కడో ఉన్నట్టుండి చూసిన తేజస్విని హీరోయిన్‌ని చేసేసిన ఘనత అతడిది.
ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్ కోసం ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ అనే నాటకాల రాయుడిని వెతికి పట్టుకున్నాడు. ఇతడిని చూస్తుంటే అచ్చు గుద్దినట్టు వీరప్పన్‌లానే ఉన్నాడు. మెలివేసిన కోరమీసం, సూదంటు రాయి లాంటి ముక్కు, నమిలేసేలా ఆ కంటిచూపు చూడగానే పరేషాన్ అవ్వాల్సిందే. కాస్టింగ్ విషయంలో వర్మను కొట్టేవాడే లేడనడానికి ఈ ఉదాహరణ చాలు.
అప్పట్లో 24/11 ఎటాక్స్ కోసం కూడా కాస్టింగ్ ఎంపికలో ఇదే తీరుగా అచ్చుగుద్దినట్టు ఉన్న తీవ్రవాదుల్ని వెతికిపట్టుకున్నాడు. దానిక్కూడా ఇంతే ప్రశంసలు వచ్చాయి. డియర్ వర్మా నువ్వు శభాషయ్యా!