సందీప్ కిష‌న్ కిల్లింగ్ లుక్ అదిరింది

Update: 2022-05-07 06:04 GMT
విభిన్న‌మైన చిత్రాల‌తో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు యంగ్ హీరో సందీప్ కిష‌న్‌. ప్ర‌స్తుతం పంథా మార్చుకుని ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. సందీప్ కిష‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `మైఖేల్‌`. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

రంజిత్ జ‌య‌కోడి ద‌ర్శ‌కుడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, క‌ర‌ణ్ సీ ప్రొడ‌క్ష‌న్స్ ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో భ‌ర‌త్ చౌద‌రి, పి. రామ్మోహ‌న్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం సందీప్ కిషన్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.

ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్స్ ని ఇష్ట‌ప‌డే సందీప్ కిష‌న్ ఈ చిత్రంలోనూ ఛాలెంజింగ్ రోల్ లో క‌నిపించ‌బోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ కోసం సందీప్ కిష‌న్ భారీ స్థాయిలో వ‌ర్క‌వుట్స్ చేశారు. కంప్లీట్ గా త‌న స‌రికొత్త మేకోవ‌ర్ లోకి వ‌చ్చేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో కిల్లింగ్ లుక్ లోకి ట్రాన్స్ ఫార్మ అయిపోయాడు. తాజాగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో సందీప్ కిష‌న్ కిల్లింగ్ లుక్ లో సిక్స్ ప్యాక్ బాడీలో క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

చుట్టూ గ‌న్స్, క‌త్తులు ప‌ట్టుకుని దుండ‌గులు దాడికి దిగుతుంటే మ‌ధ్య‌లో నిల‌బ‌డి చేతిలో గ‌న్ ప‌ట్టుకుని గుబురు గ‌డ్డం.. థిక్ హెయిర్ .. సిక్స్ ప్యాక్ బాడీతో మ్యాచో మ్యాన్ గా సందీప్ కిష‌న్ క‌నిపిస్తున్న తీరు టెర్రిఫిక్ గా వుంది. బ్ల‌డ్ షేడ్ థీమ్ లో డిజైన్ చేసిన పోస్ట‌ర్ సినిమా మూడ్ ని తెలియ‌జేస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అలాగే పోస్ట‌ర్ పై `దేవుడు మాత్ర‌మే క్ష‌మిస్తాడు` అంటూ క‌నిపిస్తున్న స్లోగ‌న్ ఇంట్రెస్టింగ్ వుంది. ఓవ‌రాల్ గా చూస్తే `మైఖేల్‌` సందీప్ కిష్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది.

స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ఇందులో విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. `మ‌జిలీ` ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ మీరోయిన్ గా న‌టిస్తుండ‌గా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, వ‌రుణ్ సందేష్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ మ‌ధ్య తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టిస్తుండ‌టంతో ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు
Tags:    

Similar News