ఫ‌స్ట్ పోస్ట‌ర్‌: ‘ర‌న్‌’కే ఫిక్స‌యిన సందీప్‌

Update: 2016-02-20 13:09 GMT
సందీప్ కిష‌న్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స‌యింది. ర‌న్‌.. అని క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో అత‌ను చేస్తున్న సినిమాకు ర‌న్ అనే పేరు ఖ‌రారు చేశారు. ఈ రోజు టైటిల్ అనౌన్స్ చేస్తూ.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది ఫ‌స్ట్ పోస్ట‌ర్‌. ఈ చిత్రానికి ముందు 123 అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పి.. ప్రేక్షకుల్నే టైటిల్ సూచించమన్నారు. ప్రేక్ష‌కులు స‌జెస్ట్ చేసిన టైటిళ్ల‌లోంచి 123 - రన్ - జిందగీ - నాకూ టైమొచ్చింది - టైమ్ బాబూ టైమ్.. ఈ ఐదూ షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలోంచి చివ‌రికి ‘ర‌న్’ అనే పేరు ఖ‌రారు చేశారు.

సందీప్ కిషన్ - అనీషా ఆంబ్రోస్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అసాధ్యుడు - మిస్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో పెద్ద హిట్టయిన ‘నేరం’కు ఇది రీమేక్. ఆ చిత్రం ప్రేమ‌మ్ ఫేమ్ అల్ఫాన్సో పుతెరిన్ కు ఫ‌స్ట్ మూవీ కావ‌డం విశేషం.కొత్త ర‌కం స్క్రీన్ ప్లేతో న‌డుస్తుందీ సినిమా. బ్యాడ్ టైం వెనకే గుడ్ టైం కూడా ఉంటుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అనిల్ సుంక‌ర ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్నాడు.ఈ చిత్రంలో బాబీ సింహా, బ్ర‌హ్మాజీ, రావు రమేష్‌, మ‌హ‌త్ రాఘ‌వేంద్ర ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆదివారం టీజ‌ర్ రిలీజ్ చేయ‌బోతున్నారు. మార్చి 23న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.
Tags:    

Similar News