యంగ్ హీరో సందీప్ మాధవ్ వరుసగా వంగవీటి మరియు జార్జ్ రెడ్డి సినిమాల్లో నటించడంతో అతడు సీరియస్ నటుడిగా ముద్ర పడ్డాడు. వరుసగా అతడు చేస్తున్న సినిమాల వల్ల అతడికి ఒక రకమైన ఇమేజ్ దక్కింది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ ను చెరిపేసుకునేందుకు సందీప్ ప్రయత్నాలు చేస్తున్నారు. జార్జ్ రెడ్డి విజయం తర్వాత కాస్త స్లో అయిన ఈ యువ హీరో తాజాగా జీవీ మధు కిరణ్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను చేసేందుకు సిద్దం అయ్యాడు. దర్శకుడు కేఎస్ రవీంద్ర వద్ద సుదీర్ఘ కాలంగా రచయితగా వ్యవహరిస్తున్న మధు కిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సందీప్ మాధవ్ ఈ సినిమాతో తన ఇమేజ్ ను మార్చకుని లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి. గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో సందీప్ మాధవ్ లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. కాస్త సన్నబడటంతో పాటు లుక్ పరంగా కూడా మార్పు వచ్చింది. రెండు సినిమాల్లో కూడా సీరియస్ గా కనిపించిన ఆయన ఈ సినిమాలో మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడని అంటున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ వరుస సినిమాలతో బిజీ అయ్యేనో చూడాలి.