దర్శకుల దారులు వేరైనా గమ్యం అదే

Update: 2017-08-29 12:30 GMT
హిట్ వచ్చిన వెనకాలే.. ఆఫర్స్ రావడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్ లో అయినా జరిగే విషయమే. ట్యాలెంట్ చూపించడం కంటే ఎక్కువగా సక్సెస్ కే డిమాండ్ కే ఉండే ఇండస్ట్రీ ఇది. ఇప్పుడు ఓ ఇద్దరు టాలీవుడ్ దర్శకులకు సడెన్ గా డిమాండ్ పీక్ స్టేజ్ లోకి వచ్చేసింది. అడ్వాన్స్ లు ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమైపోయారని తెలుస్తోంది.

నేనే రాజు నేనే మంత్రి అంటూ సక్సెస్ కళ్ల చూశాడు దర్శకుడు తేజ. ఈ దర్శకుడి నుంచి చాలాకాలం తర్వాత వచ్చిన విజయం ఇది కావడం విశేషం. మరోవైపు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఈ డైరెక్టర్ మూవీ మలిచిన విధానం అందిరనీ ఆకట్టుకుంది. దీంతో చిన్నా పెద్దా నిర్మాతల నుంచి తేజ.. సందీప్ లకు అవకాశాలు బాగానే పెరిగాయి. అయితే.. తర్వాతి సినిమా విషయంలో ఇద్దరూ చెరో రూట్ ఎంచుకున్నా.. ఇద్దరి గమ్యం ఒకే మాదిరిగా ఉండడమే ఆశ్చర్యకరమైన విషయం. తేజ వరుస ఫ్లాప్ లలో ఉన్నపుడు.. ఏ ఒక్కరు సినిమా ఇచ్చేందుకు.. పెద్ద సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. అలాంటి సమయంలో నిర్మాత సురేష్ బాబు అవకాశం ఇచ్చి.. నేనే రాజు నేనే మంత్రి మూవీ చేశారు. అందుకే తన తరువాతి కథను కూడా ముందు ఆయనకే వినిపించనున్నాడట తేజ. ఒకవేళ ఆయన రెడీ అయితే.. సురేష్ బాబుకే సినిమా చేస్తారట. ఆయన కాదంటేనే వేరేవాళ్లకు చేయాలని భావిస్తున్నాడట తేజ.

మరోవైపు సందీప్ వంగా రూట్ మరోలా ఉంది. ఇప్పటివరకూ తన తరువాతి సినిమాపై ఇంకా ఈ దర్శకుడు ఆలోచించలేదట. కానీ ఈ డైరెక్టర్ చేయబోయే మరుసటి మూవీ మాత్రం కచ్చితంగా పెద్ద ప్రొడ్యూసర్ తోనే అంటున్నారు. అంటే ఒకరు కృతజ్ఞత కోసం.. మరొకరు తన స్థాయి పెంచుకోవడం కోసం.. ఇలా ఇద్దరూ పెద్ద ప్రొడ్యూసర్లకే మూవీస్ చేయనున్నారన్న మాట.
Tags:    

Similar News